కింగ్ ఎంట్రీ ఇచ్చేశాడు.. ఆట ఆడించేందుకు అంతా సిద్దం.. నాగార్జున ఫోటోలు వైరల్

బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు. కంటెస్టెంట్లను ఓ ఆట ఆడించి.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ ప్రణాళికను సిద్దం చేసుకున్నాడు. ఇప్పటికే మూడు సీజన్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఈ షో.. నాల్గో సీజన్ సర్వసన్నద్దమవుతోంది. ఇప్పటికే ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. త్వరలోనే బిగ్ బాస్ నాల్గో సీజన్ ప్రారంభం కాబోతోందని స్టార్ మా అధికారికంగా ప్రకటించేసింది. ఇక బిగ్ బాస్‌కు కోట్లల్లో ఉన్న అభిమానుల్లో సందడి నెలకొంది. ఇక మీడియాకు, సోషల్ మీడియాకు కావాల్సినంత స్టఫ్ దొరకబోతోంది. ఇప్పటికే ఎవరి ఊహలకు వారు పదును పెట్టారు. కంటెస్టెంట్ల లిస్ట్, నాగార్జున రెమ్యూనరేషన్, బిగ్ బాస్ నిబంధనలు, నియమాలు అంటూ ఎవరికిష్టం వచ్చినట్టు వారు వార్తలు అల్లేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.

కంటెస్టెంట్ల లిస్ట్..

కంటెస్టెంట్ల లిస్ట్..

ప్రోమో విడుదలైన రోజు కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొందరు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. ఇంకొందరు లైట్ తీసుకుంటున్నారు. తరుణ్, శ్రద్దా దాస్ వంటి వారు మాత్రం ఆ వార్తలపై ఫైర్ అవుతూ కొట్టి పారేశారు. మొత్తానికి ఈ సారి లిస్ట్‌లో సింగర్ సునీత, హేమచంద్ర, వైవా హర్ష, హంసా నందిని, యామినీ భాస్కర్, నందు, అఖిల్ సార్ధిక్, మంగ్లీ, జబర్దస్త్ నరేష్ వంటి వారున్నారని తెలుస్తోంది.

 నాగ్ రెమ్యూనరేషన్..

నాగ్ రెమ్యూనరేషన్..

నాల్గో సీజన్‌కు నాగ్ తీసుకోబోయే రెమ్యూనరేషన్‌పై పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు నాగార్జునకు అందబోతోన్న మొత్తం ఎంతో తెలిస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే. వీకెండ్‌లో వచ్చి సందడి చేసే నాగార్జున.. ఒక్కో ఎపిసోడ్‌కు గానూ 12-14 లక్షలు అందుకోబోతోన్నాడని టాక్.

 ప్రత్యేక జాగ్రత్తలు..

ప్రత్యేక జాగ్రత్తలు..

హోస్ట్ నాగార్జున కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోబోతోందట బిగ్ బాస్ బృంధం. పైగా స్టార్ హీరోల్లో మొదటగా సెట్స్ పైకి వచ్చింది కూడా నాగార్జునే. అందుకే మరింత జాగ్రత్తలు తీసుకుంటోందటా. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగార్జనను అత్యంత సురక్షితంగా కాపాడుకుంటూ షూట్ చేస్తారట.

రంగంలో దర్శకుడు, కెమెరామెన్..

రంగంలో దర్శకుడు, కెమెరామెన్..

ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ ప్రోమో రాబోతోందని టాక్. ఇందు కోసం అన్నపూర్ణ సెట్‌లో షూట్ జరుగుతోంది. అది కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కెకె సెంథిల్ ఆధ్వర్యంలో షూటింగ్ జరుగుతోందట. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తాజాగా షేర్ చేశాడు.

అదిరిన స్టైల్..

అదిరిన స్టైల్..

కింగ్ నాగార్జున ఎప్పటికీ మన్మథుడే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. బిగ్ బాస్ ప్రోమో కోసం షూట్ చేస్తున్న వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోల్లో నాగార్జున లుక్‌కు , స్టైల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైట్స్, కెమెరా, యాక్షన్ అనే లోకంలోకి మళ్లీ వచ్చాను.. వావ్ వావ్ వావ్ అంటూ ఆశ్చర్య పోయినట్టు నాగ్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X