బిగ్‌బాస్ 4 కోసం నాగార్జున దిమ్మ తిరిగే స్ట్రాటెజీ.. అతడితోనే క్రేజీగా ప్లానింగ్

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 మొదలవ్వడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. దాదాపు ప్లాన్ మొత్తం రెడీ అయ్యింది. ప్రతిరోజు షోకి సంబంధించిన ఎదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక అప్పుడప్పుడు నాగార్జున ప్రోమోలతో షోకి మంచి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాగార్జున షో కోసం తనను గైడ్ చేసేందుకు ఒక దర్శకుడిని రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అతనికి అధికారికంగా హాట్ స్టార్ మంచి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్లు సమాచారం.

Recommended Video

Bigg Boss Telugu 4 : Nagarjuna's Triple Role Promo Viral బిగ్ బాస్ షో రేంజ్ పెరిగేలా !
అక్కినేని ఫ్యామిలీకి బాగా ఇష్టమైన దర్శకుడు

అక్కినేని ఫ్యామిలీకి బాగా ఇష్టమైన దర్శకుడు

ఆ దర్శకుడు మరెవరో కాదు. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ. ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం నాగ చైతన్యతో రారొండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాను కూడా చేసిన కళ్యాణ్ అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు.

బంగార్రాజు ప్లాన్ ఫెయిల్

బంగార్రాజు ప్లాన్ ఫెయిల్

అయితే ఆ తరువాత రవితేజతో నేల టిక్కెట్టు అనే సినిమాను చేసిన కళ్యాణ్ ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత నాగార్జునతోనే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. కానీ మొదటి నుంచి కళ్యాణ్ నాగార్జునను విడిచిపెట్టడం లేదు. ఇక ఇంతలో బిగ్ బాస్ తో బిజీ కావడంతో ఒక మంచి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ ప్రోమోని డైరెక్ట్ చేసింది అతడే..

ఆ ప్రోమోని డైరెక్ట్ చేసింది అతడే..


ఇటీవల నాగార్జున మూడు విభిన్న వయసులో బిగ్ బాస్ 4కి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో నాగ్ తాత, తండ్రి, మనవడి పాత్రల్లో బాగానే మెప్పించాడు. ఇక ఆ ప్రోమోని డైరెక్ట్ చేసింది మరెవరో కాదు. కళ్యాణ్ కృష్ణనే. షో మొదలైనప్పటి నుంచి కళ్యాణ్ బిగ్ బాస్ యూనిట్ తో కలిసి పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

షో ఎండ్ అయ్యే వరకు..

షో ఎండ్ అయ్యే వరకు..


నాగార్జున హోస్ట్ విషయంలో స్టార్ మా నిర్వహుకులతో పాటు కళ్యాణ్ కూడా తన సలహాలు ఇస్తున్నాడట. ఎందుకంటే నాగార్జున బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బావుంటుందో పూర్తిగా కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు. బంగార్రాజు పాత్ర ఏ స్థాయిలో క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మూడవ సీజన్ లో హోస్ట్ గా సక్సెస్ అయిన నాగ్ ఈ సారి మరింతగా ఎంటర్టైన్ చేయాలని కళ్యాణ్ ని తన పర్సనల్ డైరెక్టర్ గా నియమించుకున్నాడట. ఇక షో ఎండ్ అయ్యే వరకు కూడా అతను నాగార్జునను గైడ్ చేయనున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X