Bigg Boss: అతను నిజంగానే మిడిల్ ఫింగర్ చూపించాడు.. నాగ్ ముందు కాజల్ కంప్లైంట్.. వీడియో ప్రూఫ్
బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా వారిలోని అసలు కోపాన్ని చూపిస్తున్నారు. అవసరం వచ్చిన సమయంలో ఒకలా మాట్లాడుతున్న కంటెస్టెంట్స్ అవసరం తీరిపోయిన తర్వాత వెంటనే మళ్లీ మాట మారుస్తున్నారు. టాస్క్ ల విషయంలో ఒకరికొకరు సహాయం చేసుకునే పద్ధతులు కూడా మారిపోతున్నాయి. ఆర్జే కాజల్ మొదటి నుంచి కూడా ఫోకస్ మొత్తం తనపై పడేలా ప్రతి విషయంలో ముందడుగు వేస్తోంది. ఇక ఆమె మొదట క్లోజ్ గానే ఉన్నప్పటికీ ఆ తరువాత మెల్లగా మాటలు మార్చేస్తోంది. రవి విషయంలో చాలాసార్లు అది రుజువయ్యింది. కంటెస్టెంట్స్ ఆ విషయంలో చాలా సార్లు ఆమెపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ కాజల్ అయితే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ వారం ఆమెపై లోబో మిడిల్ ఫింగర్ చూపించాడు అనే ఆరోపణలు చేసింది. ఆ విషయంలో నాగార్జున కూడా ఆమెను ప్రశ్నించగా వీడియో తో అసలు మ్యాటట్ ఏమిటనేది అనేది నిరూపితమయ్యింది.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఈసారి బూతులు ఎక్కువగానే
బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాల్లో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నట్లు కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. ఫిజికల్ టాస్క్ లోనే కాకుండా పర్సనల్ లైఫ్ విషయాలపై కూడా చేస్తున్న కామెంట్స్ అయితే కొందరిని చాలా అప్సెట్ చేశాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా హౌస్ లో కాస్త ఎక్కువగానే బూతులు వినిపించాయి. అయితే నాగార్జున అలాంటి వారికి మొదట్లోనే అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా చేశారు.

రెచ్చగొట్టిన కాజల్
ఇక ఈ వారంలో కాజల్, రవి లోబోలను కాస్త రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా చాలా రోజులుగా ఎక్కువగా వాష్ రూమ్ లోనే ఉంటున్నారు అని.. అసలు కిచెన్లోకి ఒక్కసారి కూడా రాలేదు అని కానీ కాస్త పిచ్చిగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆ విషయంలో రవి కూడా చాలా సీరియస్ అయ్యాడు. అనవసరంగా రెచ్చగొట్టొద్దు అంటూ హెచ్చరిక కూడా చేశాడు. అయితే కాజల్ రెచ్చగొడుతున్న సమయంలో ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది.

లోబో మిడిల్ ఫింగర్
కాజల్ రెచ్చగొడుతూ మెల్లగా పక్కకు వెళ్లి పోయిన సందర్భంలో లోబో ఒక్కసారిగా చేయి పైకి ఎత్తాడు. అయితే అతను మిడిల్ ఫింగర్ చూపించినట్లు గా ఉందని కాజల్ అప్పుడే ప్రశ్నించింది. ఆ తర్వాత లోబో కూడా ఇంటెన్షన్ అయితే అది కాదని పైన ఒక బల్లి ఉంటే దానికి మాత్రమే చూపించాను అంటూ వివరణ ఇచ్చాడు. ఇక నాగార్జున అదే విషయం పై లోబోని ప్రశించాడు.

వీడియో చూపించిన నాగార్జున
ఇక ఆ సమయం లో ఉన్నటువంటి రవి ప్రియా ఆనీ మాస్టర్ లను కూడా నాగర్జున అడిగే ప్రయత్నం చేశారు. నిజంగానే మిడిల్ ఫింగర్ చూపించాడా అని వారిని అడుగగా ప్రియా అంతగా గమనించలేదు అని చెప్పేసింది. ఆ తర్వాత ఆనీ మాస్టర్ ఒకవేలు డిఫరెంట్ గా పెట్టాడు అని చెప్పింది. ఇక ఆ తర్వాత రవి అతను పైన బల్లి ఉన్నట్లు చెప్పినట్లు చెప్పడాని అంమడు. ఇక చివరికి నాగార్జున వీడియో లో కూడా చూపించాడు. అందులో లోబో కావాలని చేయలేదు అని నిరూపించడంతో ఆ గొడవ అప్పటితో క్లోజ్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











