Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లో శివాజిపై కుట్ర.. ప్లాన్‌ వేసి ఎలిమినేషన్.. నాగ్ వల్ల మేటర్ లీక్

మొదటిసారిగా రియాలిటీ కంటెంట్‌తో ప్రసారం అయినా.. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాంటిక్ సీన్స్ చూపించడంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది బిగ్ బాస్ షో. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజిపై కుట్రను నాగార్జున బయటపెట్టాడు. ఆ వివరాలను మీరే చూడండి!

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో సందీప్, శివాజి, శోభా శెట్టిలలో అనర్హత కలిగిన హౌస్‌మేట్ ఎవరో చెప్పాలని అడిగాడు. ఇందులో సందీప్‌కు 3 ఓట్లు, శివాజికి మూడు ఓట్లు వచ్చి టై అయింది. దీంతో వీళ్లిద్దరిలో పవర్ అస్త్రాన్ని ఉంచుకోడానికి అనర్హులు ఎవరో చెప్పాలని మరోసారి ఓటింగ్ పెట్టాడు. దీంతో శోభా శెట్టితో సహా ఆరుగురు శివాజి అనర్హుడు అని చెప్పిన సంగతి తెలిసిందే.

Nagarjuna Reveals Conspiracy on Sivaji in Bigg Boss 7 Telugu Show

ఓటింగ్ జరిగిన తర్వాత హోస్ట్ నాగార్జున శివాజిని హౌస్‌మేట్‌గా ఉండడానికి అనర్హుడు అని ప్రకటించాడు. అంతేకాదు, గతంలో అతడు గెలుచుకున్న పవర్ అస్త్రాన్ని తెప్పించి పగలగొట్టించాడు. దీంతో శివాజి కూడా సాధారణ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. ఈ వ్యవహారంతో కావాలనే అతడిని టార్గెట్ చేశారని ఎన్నో విమర్శలు వ్యక్తమై ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఆదివారం ఎపిసోడ్ ప్రారంభంలో శివాజి 'బాబు గారూ.. నిన్న నేను అడగలేకపోయాను. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను. ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు క్షమాపణ చెప్పాలని అడుగుతా. నేను ఎందుకు హౌస్‌మేట్‌‌గా అనర్హుడిని' అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి నాగార్జున ఏదో వివరణ ఇవ్వగా.. 'అలా కాదు.. వాళ్లను ఒక్క కారణం చెప్పమనండి' అని అడిగాడు.

శివాజి అడిగిన దానిలో న్యాయం ఉందని అనుకున్నాడో ఏమో కానీ.. హోస్ట్ నాగార్జున ముందుగా శోభా శెట్టిని లేపి 'నువ్వు కూడా శివాజికి వ్యతిరేకంగా చేయి లేపావు ఎందుకో ఒక కారణం చెప్పు' అని ప్రశ్నించాడు. దీనికామె 'నామినేషన్స్ రోజు నా రీజన్ చెప్పనీయలేదు. ప్రియాంక పేరు చెప్పినా.. అమర్ పేరు చెప్పినా జనాలు చూస్తున్నారమ్మా అనేవారు' అని చెప్పుకొచ్చింది.

శోభా శెట్టి మాటలకు నాగార్జున 'మరి నువ్వు అమర్‌, ప్రియాంకను సపోర్ట్ చేయడం లేదా? ఇప్పుడే అన్నావు కదా. అయినా అమర్‌ను సపోర్ట్ చేయడానికి ఒక రీజన్ చెప్పు' అంటూ వకీల్ పాయింట్లు తీశాడు. దీంతో శోభాకు నోట మాట రాలేదు. ఇలా చాలా సేపు వాదన జరిగిన తర్వాత శివాజికి ఏ కారణం లేకుండానే ఓట్ చేసినట్లు ఆమె ఒప్పుకోక తప్పలేదు.

ఆ తర్వాత శివాజికి వ్యతిరేకంగా ఓట్ వేసిన వారిలో ఎవరైనా మాట్లాడండి అనగా.. ప్రియాంక లేచి 'నేను వెళ్లిపోతా అని ఆయన పదే పదే అంటున్నారు అందుకే ఓట్ వేశా' అంది. దీంతో నాగార్జున 'ఏమ్మా ప్రియాంక.. అమర్ కూడా పదే పదే వెళ్లిపోతా అంటున్నాడు. అప్పుడు అతడికి నచ్చజెప్పావు. మరి శివాజి అంటే తప్పేంటి' అని అడిగే సరికి ఆమెకు నోట మాట రాలేదు.

ఆ తర్వాత గౌతమ్ లేచి 'శివాజి గారు యావర్‌కు సపోర్ట్ చేస్తున్నారు' అని అన్నాడు. దీనికి నాగార్జున 'ఆయన యావర్‌కు చేస్తే నువ్వు నామినేట్ అవ్వాలి కదా. మరి అతడిని ఎందుకు చేస్తాడు' అని ప్రశ్నించాడు. మొత్తానికి స్టార్ మా బ్యాచ్ శివాజిపై కుట్ర చేసి పవర్ అస్త్ర పోయేలా చేశారని నాగార్జున తేల్చేశాడు. అదే సమయంలో 'శివాజి నీ ఆటను జనాలు చూస్తున్నారు. నేను కూడా చూస్తున్నాను' అంటూ అతడికి అండగా నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X