Bigg Boss Vs EMK అనసూయ షో మరీ దారుణంగా? బుల్లితెరపై కొనసాగుతున్న స్టార్ హీరోల ఫ్లాప్ షో!
తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ హీరోలు, టాప్ యాంకర్ల మధ్య భారీ పోటీకి తెరలేసింది. బుల్లితెరపై నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు 5, నందమూరి తారక రామారావు హెస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు, టాప్ యాంకర్ అనసూయ హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ షోలు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ ముగ్గురు షోలు కూడా పెద్దగా ర్యాంకింగ్‌ను సంపాదించుకోలేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ప్రస్తుత ఏడాది 45వ వారం రేటింగ్ విషయానికి వస్తే..

స్టార్ షోలు పేలవంగానే..
బుల్లితెరపై నాగార్జున, ఎన్టీఆర్, అనసూయ హోస్ట్‌గా వ్యవహరించే షోలకు మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది. కానీ ఆ పాపులారిటీ టెలివిజన్‌పై బెస్ట్ రేటింగ్‌గా మలచుకోలేకపోతున్నది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి పరిస్థితి రియాలిటీ షోలకు నెలకొన్నది. పేలవంగా రేటింగ్ సంపాదించుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అనసూయ షో రేటింగ్ క్షీణిస్తూ..
యాంకర్ అనసూయ హోస్ట్‌గా వ్యవహరించే మాస్టర్ చెఫ్ రియాలిటీ షో విషయానికి వస్తే.. 44వ వారంలో అర్బన్ ప్రాంతంలో 0.88 రేటింగ్ సొంతం చేసుకొంటే.. తాజాగా 45వ వారంలో కొంచెం మెరుగ్గా 1.07 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 44 వారంలో 1.24 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 45వ వారంలో 0.99 రేటింగ్ నమోదు చేసింది.

మెరుగుపడని ఎన్టీఆర్ షో రేటింగ్
ఇక బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తన హోస్టింగ్‌తో మెరుపులు మెరిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. భారీ స్థాయిలో రేటింగ్‌ను నమోదు చేసుకోలేకపోతున్నది. గత వారం అంటే ఈ ఏడాదిలో 44వ వారం అర్బన్ ప్రాంతంలో 1.85 రేటింగ్ నమోదు చేస్తే.. తాజా వారం అంటే 45వ వారంలో 1.86 రేటింగ్‌తో సరిపెట్టుకొన్నది. అలాగే రూరల్ ప్రాంతంలో 44వ వారంలో 1.24 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 45 వారంలో కాస్త క్షీణించి 1.82 రేటింగ్‌తో సరిపెట్టుకొన్నది.

నిలకడగా బిగ్‌బాస్ తెలుగు షో
ఇక బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో విషయానికి వస్తే... వారం రోజులపాటు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు సాగే షో నిలకడగా సాగుతున్నది. అర్బన్ ఏరియాలో 44వ వారంలో 3.14 రేటింగ్‌ను నమోదు చేస్తే.. 45వ వారంలో 3.15 రేటింగ్ నమోదు చేసుకొన్నది. రూరల్ ప్రాంతంలో 44వ వారం 3.10 రేటింగ్ సాధిస్తే.. 45 వారంలో 3.14 రేటింగ్‌ను సాధించింది.
Recommended Video

నాగార్జున హోస్ట్ బెటర్ షో
ఇక నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే శని, ఆదివారాల్లో సాగే కాస్త బెటర్‌గా రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. రూరల్ ప్రాంతంలో 44వ వారంలో 5.81 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 45 వారంలో 5.84 రేటింగ్ నమోదు చేసుకొన్నది. అర్బన్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఫలితాన్ని అందుకొన్నది. రూరల్‌కు, అర్బన్ పెద్దగా తేడా లేకుండా రేటింగ్ నమోదైంది.


Click it and Unblock the Notifications











