ఓంకార్ అన్నయ్య కి గట్టి దెబ్బే

By Srikanya

హైదరాబాద్: ఓంకార్ అన్నయ్య పోగ్రాంలు టీవీ మీడియోలో ఎంత ఫేమస్సో తెలిసిందే. ముఖ్యంగా డాన్స్ షోలకు ఆయన పెట్టింది పేరు. ఆయన పోగ్రాంను తిడుతూనే జనం చూస్తూ టీఆర్పీలు పెంచేస్తూంటారు. అయితే ఆయనకు నాగార్జున చెక్ పెట్టగలిగారు. నాగార్జున రీసెంట్ టీవీ షో "మీలో ఎవరు కోటీశ్వరుడు" పెద్ద హిట్ అవటం కలిసివచ్చింది. ఆ టీఆర్పీలు నెంబర్ వన్ ప్లేసులో గత కొద్ది వారాలుగా వస్తున్నాయి. దాంతో ఓంకార్ టీవి షో రేటింగ్ లు ని దాటి నాగ్ పోగ్రాం నెంబర్ వన్ ప్లేసులో నిలిచింది. టీవి మీడియాలో ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇక నాగార్జున పోగ్రాం హిట్ కావటానికి కారణం ఆయన స్టార్ హీరో కావటం...అలాగే ఆయన తన నెట్ వర్క్ తో తన పోగ్రామ్ కు టాలీవుడ్ సెలబ్రేటీలను తీసుకువస్తున్నారు. దాంతో ఊహించని విధంగా ఈ పోగ్రామ్ కి పాపులారిటి వచ్చేసింది. చిరంజీవి వంటి స్టార్ ని స్మాల్ స్క్రీన్ పై ఊహించలేము. అలాంటి అసాధ్యాలను సాధ్యం చేస్తోంది. అలాగే మంచు లక్ష్మి ఎక్సక్లూజివ్ ఇంటర్వూ ఇచ్చింది ఓ ఎపిసోడ్ లో. ఆ వచ్చిన గెస్ట్ లు కూడా చాలా సరదాగా మాట్లాడుతూ పోగ్రాంకి నిండుతనం తెస్తున్నారు.

ఇక నాగార్జున సూపర్ హిట్ టీవి షో...'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి త్వరలో బ్రేక్ ఇవ్వబోతోంది. ఆగస్ట్ 7న ఈ షో చివరి ఎపిసోడ్(40) ప్రసారం అవుతుంది. తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుని సీజన్ 2 తో మళ్లీ వస్తారు. ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని,తన మనస్సుకు బాగా నచ్చిన షో అని నాగార్జున అన్నారు.

Nagarjuna’s check to Omkar

నాగార్జున మాట్లాడుతూ... 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా ఆడియన్స్ తో నేరుగా కలిసే అవకాశం లభించింది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రతి క్షణం ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మనసుకు దగ్గరైన కార్యక్రమం ఇది అని అని చెప్పుకొచ్చారు. అలాగే....పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు.

అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ షో దిగ్విజయంగా 40 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోవటంతో మాటీవి యాజమాన్యం సైతం చాలా సంతోషంగా ఉంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.

ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వచ్చానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరించాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేసాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చుతోందని ఆయన అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X