Bigg Boss Telugu 7: నోరు జారిన అమర్‌దీప్.. నాగార్జున వార్నింగ్.. షో చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదుగా!
ఎప్పటికప్పుడు విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. రొమాన్స్.. లవ్‌తో పాటు ఎన్నో రకాల ఎమోషన్స్ చూపిస్తూ సాగిపోతోన్న షోనే బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టు అయినా దీన్ని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను కూడా మరింత ఆసక్తికరంగా ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున.. కొన్ని వీడియోలు చూపించి సీరియస్ అయ్యారు. అసలేమైందో మీరే చూడండి!
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే 12వ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో శివాజి - అమర్‌దీప్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. ఆ సమయంలో అమర్‌దీప్ ఎంత బ్రతిమాలినా శివాజి వినకుండా అర్జున్‌కు సపోర్టు చేశాడు. మొత్తానికి ఈ పంచాయతీ తేలకపోవడంతో ఏకంగా కెప్టెన్సీ టాస్కునే బిగ్ బాస్ రద్దు చేసేశాడు.

కెప్టెన్సీ టాస్కు గురించి శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రస్తావించారు. ఈ సందర్బంగా ముందుగా అమర్‌దీప్‌తో మాట్లాడిన ఆయన.. అతడి ఆటను మెచ్చుకున్నారు. అంతేకాదు, కెప్టెన్సీ అనేది చిన్న విషయం అని.. కప్ గెలవడం ముఖ్యం అని చెప్పారు. అలాగే, రోజుకు రెండు సార్లు ఐవీలు తీసుకుంటూనే బాగా ఆడావని అమర్‌దీప్‌ను ప్రశంసించాడు.
గతంలో ప్రశాంత్ తరచూ ఏడుస్తుంటాడని, సింపథీ కోసమే ఇలా చేస్తాడని అమర్‌దీప్ ఆరోపించిన వీడియోను నాగార్జున చూపించాడు. అంతేకాదు, 'అప్పుడు ప్రశాంత్‌ను సింపతీ కోసం ఆడుతున్నాడు అన్నావు. మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు' అని ప్రశ్నించాడు. దీంతో అమర్ 'నా వరకూ వచ్చే సరికి ఆ బాధ తెలిసింది సార్. అప్పుడు తప్పు అన్నాను' అని చెప్పాడు.
అమర్‌దీప్ మాట్లాడిన వెంటనే శివాజిని నాగార్జున ప్రశ్నించాడు. అప్పుడతడు 'నేను అమర్‌కు మాటిచ్చాను. కానీ, డిప్యూటీలుగా శోభా, ప్రియాంకలను తీసుకుంటాను అనడం నాకు నచ్చలేదు. అయినా నేను అర్జున్‌ను సపోర్ట్ చేస్తానని చెప్పాను. అందుకే చేశాను. కానీ ఆ విషయం మాత్రం అమర్‌కు చెప్పలేదు' అన్నాడు. దీంతో నాగ్ 'మరి ఆ విషయం చెప్పాలి కదా' అన్నాడు.
అనంతరం శివాజి, అర్జున్‌తో అమర్‌దీప్ మాట్లాడిన వీడియోను కూడా నాగార్జున చూపించాడు. అందులో గేమ్‌లో గెలవడం కోసం ఏదైనా చేస్తానని, అందులో భాగంగానే ఏడ్చైనా సపోర్టు తీసుకుంటానని అమర్ చెప్పాడు. ఇది చూపించిన తర్వాత నాగార్జున 'అసలు నువ్వు ఏది కరెక్ట్ అమర్? జనాలతో పాటు మేము కూడా నీ మాటలకు కన్‌ఫ్యూజ్ అవుతున్నాము' అన్నాడు.
ఆ తర్వాత అమర్‌దీప్ 'ఇప్పుడు కూడా నాకు అన్న మీద కోపం లేదు సార్. కానీ నాకు విషయం చెప్పలేదు. చెప్పేముందు నేను డిజర్వ్ కాదని అన్నారు. అర్జున్‌ను వెళ్లి అడుక్కో అన్నారు. నాకు ఏమైనా ముష్టి వేస్తున్నారా? నేను మనస్ఫూర్తిగా అడిగాను. మా అమ్మ మీద ఒట్టు' అన్నాడు. దీంతో వెంటనే నాగార్జున సీరియస్ అయ్యాడు. 'అమ్మ మీద ఒట్టు ఏంటి? ఆ మాట వెనక్కి తీసుకో' అని కోప్పడ్డాడు.
ఈ పంచాయతీ జరుగుతోన్న సమయంలోనే ప్రియాంక మేటర్ కూడా వచ్చింది. అప్పుడామెపై శివాజి ఎన్నో ఆరోపణలు చేశాడు. అయినా ఆమెకు నాగార్జున మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో శివాజి - ప్రియాంక గొడవ పడ్డారు. అలాగే, అమర్‌దీప్ - శివాజి కూడా గొడవ పెట్టుకున్నారు. ఇలా ఈ షో చరిత్రలో హోస్ట్ ముందే ఎప్పుడూ గొడవలు జరగకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











