పల్లవి ప్రశాంత్‌కు అన్యాయం.. విన్నర్ అవుతాడుకుంటే దెబ్బేశారుగా.. నాగార్జునపై విమర్శలు

ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న షోనే బిగ్ బాస్. ఎన్నో భాషల్లో వస్తున్నా తెలుగులో మాత్రమే ఇది భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా రికార్డులు సైతం క్రియేట్ చేస్తుంది.

ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పల్లవి ప్రశాంత్‌కు ఓ విషయంలో అన్యాయం జరిగింది. అసలు ఏమైంది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Nagarjuna Serious on Pallavi Prashanth about Amardeep Issue in Bigg Boss Telugu 7 Show

సరదా సమయంలో వివాదాలు: ప్రతి బిగ్ బాస్ సీజన్‌లోనూ 14వ వారంలో ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన కంటెంట్‌ను చూపిస్తుంటారు. కానీ, ఏడో సీజన్‌లో మాత్రం ఓట్ అప్పీల్ టాస్క్ పెట్టారు. ఇందులో ప్రేక్షకులను తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడం కోసం కంటెస్టెంట్లు పోటీ పడ్డాడు. ఇందులో జరిగిన టాస్కుల్లో ఎన్నో గొడవలు జరిగాయి. వాటిలో కొన్ని వివాదంగానూ మారిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ - అమర్ వివాదాన్ని: గత వారం జరిగిన ఓట్ అప్పీల్ టాస్కులో అమర్‌దీప్ - పల్లవి ప్రశాంత్ మధ్యన పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ వాగ్వాదానికి దిగిన అంశంపై బయట కూడా భారీగానే చర్చ జరిగింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌తో అమర్‌దీప్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ అంశంపై శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున స్పందించాడు.

ఏ వీడియో చూపించాలి సార్: పల్లవి ప్రశాంత్ కన్‌ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన వెంటనే నాగార్జున వెటకారం మొదలు పెట్టాడు. ముందుకు వంగి, చేతులు కట్టుకుని మరీ 'సార్ మీకోసం ఏ ఈడియో ప్లే చేయాలి సార్? మీరు అడిగినప్పుడల్లా బిగ్ బాస్ వీడియో చూపించాలా' అంటూ సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ వీడియో చూపించాడు. ఇందులో ప్రశాంత్‌దే తప్పు అని తేలిపోయింది.

డాక్టర్ మొత్తం చెప్పేశాడని: ఆ తర్వాత అమర్‌దీప్ చౌదరి చేయి కొరికాడని పల్లవి ప్రశాంత్ చేసిన ఆరోపణలపై నాగార్జున మరింత ఘాటుగా స్పందించాడు. దీంతో రైతు బిడ్డ 'నన్ను కొరికాడు. కొంచెం రక్తం వచ్చినట్లు అయింది' అన్నాడు. దీంతో నాగ్ 'నేను ఇప్పుడే డాక్టర్‌తో మాట్లాడాను. నీ చేతి మీద ఎలాంటి బ్లడ్ మార్క్ లేదని చెప్పారు. నీకు కేవలం పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇచ్చారు' అని చెప్పాడు.

అర్జున్‌ను పిలిచి సాక్ష్యంగా: నాగార్జున చెప్పిన మాటలకు పల్లవి ప్రశాంత్ ఏకీభవించలేదు. దీంతో ప్రత్యక్ష సాక్షి అయిన అర్జున్‌ను పిలిచి అడిగాడు. అతడేమో 'పంటి గుర్తులు పడ్డాయి కానీ రక్తం వచ్చినట్లు అనిపించలేదు' అని చెప్పాడు. దీంతో నాగార్జున మరింత అడ్వాంటేజ్ తీసుకుని ప్రశాంత్‌కు క్లాస్ పీకేశాడు. ఇకనైనా ఆటపై దృష్టి పెట్టు అంటూ సలహాలు కూడా ఇచ్చాడు.

శివాజికి సేవలు ఎందుకు?: అనంతరం పల్లవి ప్రశాంత్ స్టోర్ రూమ్ నుంచి కాఫీ పౌడర్ తీసుకుని వచ్చి శివాజికి ఇచ్చిన వీడియోను కూడా నాగార్జున ప్లే చేయించాడు. అప్పుడు అలా ఎందుకు చేశావని సూటిగా ప్రశ్నించాడు. అంతేకాదు, 'నువ్వు శివాజికి సేవకుడివా? అయినా ఎన్ని సేవలు చేస్తావ్? ఈ హౌస్‌లో శివాజీకి గులాంవా? చివరి వారంలో ఉన్నావు. గులాంగిరి అనేది మానేసెయ్' అన్నాడు.

ప్రశాంత్‌కు అన్యాయమే: మొత్తంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ పట్ల నాగార్జున వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. అసలే అమర్‌దీప్ వల్ల చులకన అయిపోయిన బాధలో ఉన్న అతడిని హోస్టు తిట్టడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే, అమర్‌దీప్‌తో అతడికి సారీ చెప్పించకపోవడం పెద్ద మిస్టేక్‌లా మారింది. ఏదైతేనేం ఫినాలేకు ముందు ప్రశాంత్‌కు ఇది అన్యాయమే అనాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X