బిగ్ బాస్ యూనిట్‌పై నాగార్జున తీవ్ర ఆగ్రహం: ఇలాగైతే హోస్టింగ్ చేయనని వార్నింగ్!

తెలుగులో ప్రసారం అవుతోన్న సక్సెస్‌ఫుల్ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఎన్నో సందేహాల నడమ మన భాషలో ప్రారంభం అయిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ కారణంగానే వరుసగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటోంది. ఈ రియాలిటీ విజయంలో హోస్టుల పాత్ర కూడా ఎంతో కీలకమైనే చెప్పాలి. మరీ ముఖ్యంగా నాగార్జున ఎంట్రీ ఇచ్చాక మరింత రేటింగ్ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ యూనిట్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై హోస్టింగ్ చేయనని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఆ వివరాలు మీకోసం.!

వాళ్లిద్దరూ షోకు వన్నే తీసుకొచ్చారు

వాళ్లిద్దరూ షోకు వన్నే తీసుకొచ్చారు

బిగ్ బాస్ షోను తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి హోస్టుల పాత్ర కూడా చాలా ఉంది. అందులోనూ మొదటి సీజన్‌ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెరీర్‌లో మొదటి సారే అయినా అద్భుతమైన టాలెంట్‌తో షోను నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ఆ తర్వాత వచ్చిన నాని కూడా సహజసిద్ధమైన హోస్టింగ్‌తో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.

నాగ్ ఎంట్రీతో మొత్తం మారిపోయింది

నాగ్ ఎంట్రీతో మొత్తం మారిపోయింది

రెండు సీజన్లు చేసిన హోస్టులు అందుబాటులో లేకపోవడంతో మూడో సీజన్‌‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' షో చేసిన అనుభవంతో దీన్ని కూడా చక్కగా హోస్ట్ చేశాడు. అదే సమయంలో ప్రారంభ, ఫైనల్ ఎపిసోడ్లకు భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుని రికార్డులకెక్కారు. ఈ సీజన్ వల్లే తెలుగు బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

నాలుగో సీజన్‌ రికార్డుతో మొదలైంది

నాలుగో సీజన్‌ రికార్డుతో మొదలైంది

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌కు సైతం నాగార్జునే హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఆయన మొదలు పెట్టిన ఈ సీజన్‌ కూడా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. మరీ ముఖ్యంగా ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ అందుకుని నేషనల్ రికార్డును క్రియేట్ చేశారాయన. కంటెస్టెంట్లతో మెలిగే విధానంతోనూ మెప్పిస్తూ షోను ఆహ్లాదకరంగా నడుపుతున్నారు.

బిగ్ బాస్‌లో ఊహించని సంఘటనలు

బిగ్ బాస్‌లో ఊహించని సంఘటనలు

తెలుగు బిగ్ బాస్ అంటేనే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో వస్తోంది. దీనికి కారణం ఈ సీజన్‌లో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఫైనల్స్ వరకు ఉంటారనుకున్న కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడం, సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులు, మిడ్ వీకెండ్ ఎలిమినేషన్ సహా ఎన్నో సరికొత్త ప్రయోగాలతో ఈ సీజన్ హైలైట్ అవుతోంది.

బిగ్ బాస్‌పై నాగార్జున తీవ్ర ఆగ్రహం

బిగ్ బాస్‌పై నాగార్జున తీవ్ర ఆగ్రహం

బిగ్ బాస్ షో అంటేనే రియాలిటీ ఆధారంగా సాగుతోందని అందరికీ తెలుసు. అందుకే ఈ షోలో జరిగే ప్రతి విషయం ఎంతో రహస్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు నిర్వహకులు. కానీ, నాలుగో సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగినా ఒకరోజు ముందుగానే లీకైపోతుంది. దీంతో షోపై ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యూనిట్‌పై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.

Recommended Video

Star Director On Cards For Chatrapathi Bollywood Remake
ఇలాగైతే హోస్టింగ్ చేయనని వార్నింగ్

ఇలాగైతే హోస్టింగ్ చేయనని వార్నింగ్

ప్రసారానికి ముందే ప్రతి విషయం లీక్ అయిపోతుండడంపై సీరియస్‌గా ఉన్న నాగార్జున.. ఇదే కంటిన్యూ అయితే హోస్టింగ్ చేయనని బిగ్ బాస్ యూనిట్‌కు వార్నింగ్ ఇచ్చాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ముందే బయటకు వస్తే షో ఎవరు చూస్తారని ఆయన నిర్వహకులపై ఫైర్ అయ్యారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X