Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌కు నాగార్జున షాక్.. కావాలనే రైతుబిడ్డను సైడ్ చేస్తున్నారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో కానీ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా టీఆర్పీని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతోంది. ముఖ్యంగా మొదటి వారంలోనే కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎవరూ ఊహించని స్థాయిలో గేమ్ ఆడుతున్నాడు. సింపుల్ గా కనిపిస్తూనే సూపర్ గా గేమ్ ప్లే చేస్తూ రెచ్చిపోతున్నాడు. టైటిల్ రేసులో పరిగెడుతూ.. అందరినీ షాక్ కు గురి చేస్తున్నాడు. ముఖ్యంగా అమర్ దీప్ పెట్టుకున్న గొడవతో ఫుల్ హైలెట్ అయిన ఈయన అద్భుతంగా ఆడుతున్నాడు.

ఇప్పటి వరకు ఒకే మాదిరి గ్రాఫ్ తో ఆటతీరు కనబర్చిన ఈయన.. 12వ వారంలో మాత్రం చాలా డౌన్ అయిపోయాడు. ముఖ్యంగా బిగ్ బాస్ టీం నిర్వాహకులు కావాలనే పల్లవి ప్రశాంత్ ను చంపించారు. దీంతో అతడు డెడ్ అయిపోయి.. స్మశానానికి పరిమితం అయ్యాడు. ఎవరితో మాట్లాడే వీలు కూడా లేకపోవడంతో ఆయన సరిగ్గా స్క్రీన్ లో కూడా కనిపించలేదు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో అశ్విని శ్రీ కూడా దెయ్యంగా మారింది. దీంతో కనీసం అతడితో మాట్లాడేందుకు ఓ అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత వెంటనే గౌతమ్ కృష్ణ కూడా చనిపోయాడు. ఇలా అతడు కూడా దెయ్యంగా మారి స్మశానంలో అడుగు పెట్టాడు.

 Nagarjuna Shock to Pallavi Prashanth About Bad Words on Ashwini Bigg Boss Telugu 7

అయితే అప్పుడు అశ్విని శ్రీ కావాలని గౌతమ్ కృష్ణతో మాటలు కలిపింది. కావాలనే కామెడీగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దానికి అతడు కూడా కామెడీగా స్పందించడంతో ఇద్దరూ కలిసి.. జిలేబీ కావాలా, గులాబీ కావాలా అంటూ అశ్విని శ్రీ గౌతమ్ కృష్ణను అడిగింది. అయితే వీరి వెనకే ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కామ పిశాచి అంటూ అశ్విని శ్రీపై కామెంట్లు చేశాడు. దీనికి వెంటనే అశ్విని స్పందించి.. అలా మాట్లాడడం తప్పు అంటూ గొడవ పెట్టుకుంది. అందుకు రైతుబిడ్డ కూడా సారీ చెప్పాడు. కానీ ఈరోజు మాత్రం నాగార్జున ఈ విషయంపై చాలా గట్టిగా ఫైర్ అయ్యాడు.

 Nagarjuna Shock to Pallavi Prashanth About Bad Words on Ashwini Bigg Boss Telugu 7

ఈరోజుటి ప్రోమో చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతుంది. ముఖ్యంగా ముందుగా పల్లవి ప్రశాంత్ ను లేపిన నాగార్జున.. మర్డర్ అయిపోయావు, దెయ్యం అయిపోయావు.. మరి ఆ తర్వాత మాట్లాడిన బూతులు ఏంటంటూ ప్రశ్నించాడు. ప్రశాంత్ మాట్లాడు ప్రశాంత్... నామినేషన్స్ లో ఇలా పెట్టి మాట్లాడుతావుగా అంటూ ఛాతీని చాలా వెడల్పు చేశాడు. అలా చూస్తూ ఉండిపోయిన పల్లవి ప్రశాంత్.. తల దించుకున్నాడు. వెంటనే నాగార్జున అశ్విని, గౌతమ్ కృష్ణలను కూడా లేవమని చెప్పాడు. ఏం ప్రశాంత్ అని మరోసారి అనగా.. సార్ నేను కావాలని అనలేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు.

తప్పు అయితే సారీ అని కూడా చెప్పానంటూ పల్లవి ప్రశాంత్ నాగార్జునకు వివరించాడు. అందుకు నాగార్జున ఎవరూ కావాలని అనరు అంటూ చెప్పుకొచ్చాడు. కామెడీ మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి మాటలు వెళ్లిపోతుంటాయి. కానీ అశ్వినీకి ప్రాబ్లం వచ్చింది. అలాంటప్పుడు కాస్త ఇబ్బంది కల్గుతుందని చెప్పుకొచ్చాడు. ఫ్లోలో అన్న ఇంత చిన్న మాటకే నాగార్జున లేపి ఇలా కడిగేయాల్సిన అవసరం లేదని నెటిజెన్లు భావిస్తున్నారు. కావాలనే పల్లవి ప్రశాంత్ ను సైడ్ చేయాలని ఇలా చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X