Bigg Boss Telugu 7: శివాజీ నా దగ్గరకు వచ్చి.. శుభ శ్రీ ఫిర్యాదుకు నాగార్జున దిమ్మతిరిగేలా షాక్!
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ స్టార్ట్ అయింది. ఇక గత సీజన్స్ కంటే విభిన్నంగా ఈ సీజన్ సాగుతోంది. ఇక హోస్టుగా నాగార్జున గత సీజన్స్ కంటే ఈ సారి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహారిస్తున్నారు. ఇక ఆయన ఈ వీకెండ్ ఎపిసోడ్ లో అందరి బెండు తీసే కార్యక్రమం పెట్టుకున్నాడు. గత వారం నుంచి హౌజ్ లోని సభ్యులు చేసిన మిస్టేక్స్ ఒక్కోటి వీడియోలతో సహా బయటపెట్టి.. వారిని ఉతికి ఆరేస్తున్నాడు. ఇక తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ముగ్గరు ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం మరో ఎలిమినేషన్ ఉండనుంది. ఇక ఈ వారం రతిక ఎలిమినేట్ అవ్వనుందని బిగ్ బాస్ వర్గాల సమాచారం. ఆమెకు ఓటింగ్ బాగానే ఉన్నా.. నెగిటివిటీ వల్ల ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున ఫుల్ ఫైర్ మీద ఉన్నట్లు ప్రోమోలు చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటికే వీకెండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ కాగా... ఇప్పుడు సెకండ్ ప్రోమో రిలీజ్ అయింది.

శుభ శ్రీకి షాక్...
ఇక ఈ ప్రోమోలో కూడా నాగ్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఇంట్లోని సభ్యుల తప్పులను వెతికి మరీ వీడియోలతో సహా బయటపెడుతున్నాడు. ఇక ఈ వారం మొత్తం హాట్ టాపిక్ అయిన శివాజీ, శుభ శ్రీ మ్యాటర్ పై డిస్కర్షన్ పెట్టాడు. శివాజీ తన మీద మీదకు వచ్చాడు అంటూ బిగ్ బాస్ కు శుభ శ్రీ కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఈ విషయంపై నాగార్జున.. శుభ శ్రీని అడిగాడు. ఏమైంది చెప్పు అని అడగ్గా... శివాజీ గారు తనకు దగ్గరగా వచ్చారు.. అది నాకు ఇబ్బంది అయింది అని చెప్పుకువచ్చింది.

వీడియో వేసి మరీ...
ఇక నాగార్జున శివాజీ అలా దగ్గరకు రావడం అన్ కంఫార్టబుల్ అనిపించిందా.. మిస్ బిహేవ్ చేశాడా అని నాగార్జున అంటాడు. దానికి శుభ.. మిస్ బిహేవ్ చేయలేదు... కానీ దగ్గరకు వస్తున్నాడు అని చెప్తుండగా.. నాగ్ వీడియో వేసి.. చూపిస్తాడు.. ఇదేనా నువ్వు అన్ కంఫార్టబుల్ గా ఫీల్ అయిందని నాగార్జున అంటాడు. ఇది ఆట కదా శుభ శ్రీ అంటూ ఆమె ఫీజ్ ఎగురగొడతాడు.
రతిక అక్కకు క్లాస్
ఇక రతిక అక్క దగ్గరకు వచ్చేసరికి... ప్రశాంత్ ను సిగ్గుందా.. ఇట్లనే పెంచిర్రా.. అని ఇంట్లో వాళ్లను ఎందుకు లాగావ్ అని ఫైర్ అయ్యాడు. పనిలో పనిగా అమర్ దీప్ ను కూడా వేసుకున్నాడు నాగార్జున. ఇక గౌతమ్.. మీద ప్రశాంత్ చేసిన నేరారోపణ గురించి మాట్లాడారు. గౌతమ్ తను శోభా శెట్టిని అలా ఫిజికల్ షేప్ చేయలేదని చెప్తాడు. ఇక నాగార్జున వీడియో వేసి క్లారిటీ ఇస్తాడు. అందులో గౌతమ్.. శోభా శెట్టిని గెస్టర్ చేయడం కనిపిస్తుంది. ఇక శోభా శెట్టి ఇట్ ఇజ్ రాంగ్ అంటూ చెప్తుంది.

గౌతమ్ రాంగ్ స్టేప్
మరి అప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తాడు. ఇక గౌతమ్.. శోభా శెట్టి విషయంలో తప్పు చేశారని ఎవరు అనుకుంటున్నారు అనగానే సీరియల్ బ్యాచ్ చేతులు ఎత్తుతుంది. ఇక గౌతమ్ చేసింది తప్పు అని నాగార్జున డిసైడ్ చేస్తాడు. మరి గౌతమ్ చేసిన తప్పుకు నాగార్జున ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో వీకెండ్ ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











