సీరియల్,స్పై కాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో మరో సీక్రెట్ గ్రూప్..తొలిసారి గుట్టువిప్పిన నాగార్జున!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా షో అద్భుతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా ముందుగా 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్ ఆ తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను లోపలికి పంపించారు. అంతటితో ఆగకుండా ముందు వారాల్లో ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ ను కూడా ఇంట్లోకి తీసుకువచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు ఇస్తూ ఓను అద్భుతంగా మలుస్తుండగా.. బిగ్ బాస్ ఇంట్లో మాత్రం కొన్ని గ్రూపులు ఉన్నాయి. తాజాగా నాగార్జున వాటి గురించి చెప్పి షాకిచ్చారు.
సీజన్ ప్రారంభం అయిన మొదటి రోజు నుంచి అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలు కలిసి గ్రూపు గేమ్ ఆడారు. అలాగే వీరి జట్టునే టేస్టీ తేజ, సందీప్ మాస్టర్ లు కూడా ఉండేవారు. వారు ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి వీరు ముగ్గురూ కలిసే గేమ్ లు ఆడుకుంటున్నారు. ముగ్గురూ గెలవాలని అనేక ప్లాన్ లు వేసుకుంటూనే.. అంతా ఒక్క మాటపై ఉంటున్నారు. ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి కాస్త దూరంగా ఉంటున్నట్లు నటిస్తున్నా పెద్దగా మార్పు ఏమీ లేదని వాళ్ల చేసే పనులు చూస్తుంటేనే అర్థం అయిపోతింది.

ఇదే కాకుండా అమర్ దీప్ తో పాటు ఇంట్లోని వాళ్లంతా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కార్నర్ చేసినప్పుడు అతడికి అండగా నిలబడ్డ శివాజికి కూడా ఓ గ్రూప్ ఉంది. అందులో పల్లవి ప్రశాంత్ తో పాటు ప్రిన్స్ యావర్ ఉండగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన భోలె షవాళి కూడా వీరికి సపోర్టింగ్ గా నిలిచారు. అలాగే మొదటి సార్ రైతుబిడ్డను కార్నర్ చేసి ఫుల్ నెగిటివిటీ సంపాధించినకున్న రతికా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్లతోనే ఉంటూ గేమ్ ఆడింది. అయితే ఇప్పుడిప్పుడే వారి గ్రూపులోంచి బయటకు వచ్చి సింగిల్ గా ఉంటోంది.
ఈ గ్రూపులు గురించి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు గ్రూపులు మాత్రమే కాకుండా ఇంట్లో మరో సీక్రెట్ గ్రూపు కూడా ఉందని తాజా ప్రోమో చూస్తుంటే అర్థం అయిపోతుంది. అయితే ఆ ప్రోమోలో ఏముంది, నాగార్జున ఏమన్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని శ్రీ ఎలిమినేట్ అయి స్టేజీ మీదకు రాగా... తాను ఏ గ్రూపుకు చెందిన దాన్ని కాకుండా గేమ్ ఆడానని... అటు శివాజి, ఇటు అమర్ దీప్ ల బ్యాచ్ ల మధ్య తానొక్కదాన్నే ఒంటరిగా నిలిచానని వివరించింది. ముఖ్యంగా శోభా, ప్రియాంకలు అమర్ తో.. ప్రశాంత్, యావర్, రతికాలు శివాజితో ఉన్నట్లు వెల్లడించింది.
ఇంతలోనే అంబటి అర్జున్ అందుకొని... నేను అటూ ఇటూ కాకుండా పోయానా.. కనీసం ఒంటరిగా కూడా నీకు కనిపించలేదా అంటూ ఫన్నీ చేశాడు. వెంటనే నాగార్జున.. స్పందించి నిన్ను చూస్తేనే ఆమెకు భయమేస్తుంది మరెలా నీ గురించి చెబుతుందంటూ జోక్ వేయగా అందరూ నవ్వారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో చుక్క బ్యాచ్, మొక్క బ్యాచ్ తో పాటు తొక్క బ్యాచ్ అని.. అది అంబటి అర్జున్ యే అని చెప్పుకొచ్చారు. ఇలా ఇంట్లో మూడు గ్రూపులు ఉన్నాయంటూ కామెడీ చేశారు నాగార్జన.


Click it and Unblock the Notifications











