Bigg Boss Telugu 7: ప్రియాంక జీవితంలో రతిక నిప్పులు పోసిందన్న నాగ్.. శివ్‌తో బ్రేకప్ తప్పదా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రోజురోజుకూ మరింత ఆసక్తిగా మారుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు, అంతకు మించిన ట్విస్టులతో రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా పదో వారంలో బిగ్ బాస్ ఇంట్లో ఫుల్ జోష్ నిండింది. ఇల్లంతా ఎమోషన్స్ తో నిండిపోయింది. కంటెస్టెంట్ల అందరి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రావడంతో అంతా ఫుల్ బూస్ట్ అయ్యారు.ఈ ఊపుతోనే గేమ్ ఆడేందుకు.. కప్పు కొట్టేందుకు రెడీ అయిపోయారు. నామినేషన్ల అప్పుడు కోపం, ఏడుపు, పెడబొబ్బలు కాగా... కుటుంబ సభ్యులతో ప్రేమ, కోపం, బాధ చూపించారు. వాళ్లు అలా బయటకు పోయారో లేదో కెప్టెన్సీ టాస్కులో మరింత రెచ్చిపోయారు.
శివాజి, గౌతమ్ కృష్ణల మధ్య పెద్ద వార్ జరగ్గగా... తాజాగా అమర్ దీప్, ప్రిన్స్ యావర్ల మధ్య మరింత గొడవ జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈరోజుటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ టీం వదిలింది. అందులో నాగార్జున కంటెస్టెంట్లతో ఫన్నీగా మాట్లాడి ఆ తర్వాత ఫైర్ అయిపోయాడు. ముఖ్యంగా రతికా రోజ్ తో బాగా మాట్లాడుతునే మనసుకు తాకే కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈరోజుటి ప్రోమోలో ముందుగా... అర్జున్ శోభా కెప్టెన్సీ ఎలా ఉందని అడిగాడు. అందుకు అర్జున్ వీఐపీ రూంలో ఎంజాయ్ చేయడమే సరిపోయిందని సార్ అని చెప్పగా అంతా నవ్వారు. శోభా కూడా ముసిముసిగా నవ్వుకుంది. ఆ తర్వాత రతికా రోజ్ ను లేపిన నాగార్జున ప్రియాంక జీవితంలో నిప్పులు పోస్తావా అంటూ కామెడీగానే అడిగాడు. కానీ ఇది చాలా హర్టింగ్ విషయం. అసలే నెగిటివిటీ సంపాధించుకుని తన గేమ్ తాను ఆడుకుంటున్న రతికాను లేపి నాగార్జున ఇలా అడగడం వైరల్ గా మారింది. ఇందుకు రతికా కూడా అయ్యయ్యో అలా ఏం లేదు సార్ అని అంది.
అన్నయ్య లాగా ఇస్తా అన్నప్పుడు చెల్లిలాగా తీసుకోవాలనుకున్న అని చెప్పేలోపే.. ప్రియాంక జైన్ మధ్యలో కల్గజేసుకుంది. అమ్మా అంటూ అరిచింది. దీంతో అంతా గట్టిగా నవ్వారు. దీనికి నాగార్జున మరోసారి స్పందిస్తూ... రతికా నువ్వు ఎప్పుడు ఎవరిని అన్నయ్యా అని పిలుస్తావో మాకు తెలీదంటూ దండం పెట్టాడు. ఈక్రమంలోనే పల్లవి ప్రశాంత్ ను ఫోకస్ చేశారు కెమెరామాన్. నాగార్జున అలా అనగానే రైతుబిడ్డ కూడా బాగా నవ్వాడు. పక్కనే ఉన్న భోలె షవాళి కూడా మరింత నవ్వాడు.
ఇది చాలా కామెడీగానే అనిపిస్తున్నప్పటికీ.. రతికా రోజ్ కాస్త ఫీలయినట్లు అనిపిస్తోంది. రేపటి ఎపిసోడ్ చూస్తే తప్ప రతికా రోజ్ కు ఆ క్షణం ఏమనిపించిందో తెలియదు. ముందుగా ఇలా ఫన్నీగా సాగిన ప్రోమో చివర్లో చాలా హీటెక్కిపోయింది. ముఖ్యంగా రాజమాతలుగా.. శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు చాలా బయాస్డ్ గా వ్యవహరించినట్లు అనిపించిందని నాగార్జున చెప్పారు. మరి ఈరోజుటి ఎపిసోడ్ పూర్తిగా తెలిస్తే.. ఎవరెవరికి గట్టిగా క్లాస్ పడిందో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











