60ఏళ్ళ వయసులో ఈ రిస్క్ అవసరమా.. బిగ్ బాస్ 4 విషయంలో నాగార్జున కీలక నిర్ణయం

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో తెలియదు గాని షోను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. రోజుకో రూమర్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది గాని హైప్ ఎంత క్రియేట్ అవుతున్నా కూడా ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్న సమయంలో ఊహించని విదంగా హోస్ట్ గా చేయనున్న నాగార్జున హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చాలా కష్టమైన పని

చాలా కష్టమైన పని

బిగ్ బాస్ షోను స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు చాలా కష్టమైన పని. కరోనా వైరస్ రోజురోజుకి మరింత భయంకరంగా మారుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎవరో ఒకరికి పాజిటీవ్ వస్తూనే ఉంది. ఇప్పటికే కొంతమంది సీరియల్ నటులు కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌజ్ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ రాదు అనే గ్యారెంటీ లేదు.

ఆ పనుల వల్ల కరోనా?

ఆ పనుల వల్ల కరోనా?

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ ని షో స్టార్ట్ అవ్వడానికి ముందు పరీక్షలు చేసి లోపలికి పంపినప్పటికి బ్యాక్ గ్రౌండ్ లో టెక్నీషియన్స్ నిత్యం వర్క్ చేస్తూనే ఉంటారు. హౌజ్ లోకి ఎదో ఒక విధంగా నిత్యావసర వస్తువులను ఇతర బ్రాండ్స్ ని మార్చాల్సి ఉంటుంది. కరోనా రాదు అనేలా కచ్చితంగా ఎవరు నమ్మకంతో చెప్పలేరు.

60ఏళ్ళ వయసులో..

60ఏళ్ళ వయసులో..

అమితాబ్ బచ్చన్ లాంటి ఫ్యామిలీ మెంబర్స్ కారోన్ నుంచి తప్పించుకోలేక పోయారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అలాగే వారి కూతురు ఆరాధ్యకి కూడా వచ్చింది. అంటే వయసుతో సంబంధం లేకుండా వైరస్ ఎంత స్పీడ్ గా సోకుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నాగార్జున ఈ 60ఏళ్ల వయసులో రిస్క్ చేయకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

నాగార్జున కీలక నిర్ణయం

నాగార్జున కీలక నిర్ణయం

50ఏళ్ల పైబడిన వారికి కరోనా చాలా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉందని నాగార్జున ఇటీవల బిగ్ బాస్ తో జరిగిన ఆన్లైన్ మీటింగ్ లో తన నిర్ణయాన్ని చెప్పేశారట. ఇప్పట్లో రిస్క్ చేయాలని తనకు ఏ మాత్రం నమ్మకంగా అనిపించడం లేదని అలాగే తను చేస్తున్న షో వల్ల ఇతరులకు ఇబ్బంది కలగడం కూడా తనకు ఏ మాత్రం ఇష్టం లేదని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
మధ్యలో షో ఆగిపోతే..

మధ్యలో షో ఆగిపోతే..

ఒకవేళ బిగ్ బాస్ ని తగిన జాగ్రత్తలతో మొదలు పెట్టినా కూడా మధ్యలో కరోనా ఆటంకాలు వస్తే షోను ఆపేయ్యల్సిందే తప్ప మరో దారి ఉండదనే విషయాన్ని కూడా నాగ్ నిర్వాహకులకు వివరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బయపడుతూ చేయడం కన్నా వైరస్ తీవ్రత తగ్గిన తరువాతే ధైర్యంగా స్టార్ట్ చేద్దామని కూడా నాగార్జున తెలిపినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X