Bigg Boss Telugu 7: నాగార్జున హింట్ చూస్తుంటే.. ఎలిమినేటే అయ్యేది ఆమేనని అర్థమైపోతుందిగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. అద్భుతమైన టాస్క్ లతో వార్ వన్ సైడ్ అన్నట్లుగా నడుస్తోంది. మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించిన బిగ్ బాస్.. ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపారు. ఇక అంతకు ముందు వారాల్లో ఎలిమినేట్ అయిన వాళ్లలోంచి మరొకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇలా షాకులు మీదు షాకులు, ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ.. షోను అద్భుతంగా మలచడంలో బిగ్ బాస్ నిర్వాహకులు పూర్తిగా సఫలం అవుతున్నారు. అయితే ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్ ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల అయింది.

అయితే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందని.. ఇప్పటికే బిగ్ బాస్ చెప్పారు. గత వారం ఎలిమినేషన్ లేకపోవడం.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో షో మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఈ వారం వీకెండ్ ఎపిసోడ్స్ కోసం పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఎవరెవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు సేవ్ కాబోతున్నారిన తెలుసుకునేందుకు కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ వేచి చూస్తున్నారు. అయితే తాజాగా విడుదల అయిన ప్రోమోలో నాగార్జున చాలా ఫైర్ అవుతూ కనిపించారు.

Nagarjuna Shocking Hint to Ashiwni Sri in Bigg Boss Telug 7 Latest Promo

ముఖ్యంగా అశ్విని శ్రీని నిల్చోమని చెప్పిన నాగార్జున... ఈ వారం డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా అని ఆమెను అడిగారు. దీనికి అశ్విని శ్రీ ఈసారి డబుల్ ఎలిమినేషన్ అని చెప్పింది. అది విన్న నాగార్జున మరి ఎందుకు సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నావు, కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అంటూ క్లాసు పీకాడు. డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలిసి కూడా ఇలా చేస్తావా ఇది చాలా డేంజర్ అంటూ చెప్పుకొచ్చాడు.

నాగార్జున మాట్లాడిన విధానం, చేసిన కామెంట్లు చూస్తుంటే ఈవారం ఎలిమినేట్ అయ్యే వాళ్లలో అశ్విని శ్రీయే ముందుంటుందని అర్థం అయిపోతుంది. మరోవైపు అంబటి అర్జున్, రతికా రోజ్ లు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు.. ఒకవేళ వీరిద్దరిలో ఒకరికి పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాల్సి వస్తే.. ఎవరికే వాడుతాడనే దానిపై అందరిలోనూ అనుమానం ఉంది.

Nagarjuna Shocking Hint to Ashiwni Sri in Bigg Boss Telug 7 Latest Promo

మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి ఎవరు ఇంట్లో కొనసాగబోతున్నారో తెలియాలంటే మాత్రం ఈరోజు, రేపటి ఎపిసోడ్లను తప్పని సరిగా చూడాల్సిందే. ఇదంతా ఇలా ఉండగా.. ఈసీజన్ విన్నర్ గా అమర్ అవుతాడని అంతా అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ జనాల్లో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన శివాజికి ప్రస్తుతం చాలా నెగిటివిటీ వస్తోంది. చూడాలి ఎవరు విన్నర్ గా నిలిచి, ఎవరెవరు టాప్ 5లో ఉంటారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X