Bigg Boss 7 Telugu: నాగార్జున ఉల్టా పుల్టా ట్విస్ట్.. ఏడుగురూ ఎలిమినేషన్‌లోనే.. చివర్లో గుడ్ న్యూస్
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరిది. అంతలా ఈ షో దాదాపు ఏడేళ్లుగా టెలివిజన్ రంగంలో సంచలనం అవుతోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌ను కూడా భారీ స్థాయిలో రాబడుతూ దేశంలోనే నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది. దీంతో షో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు జరగనున్నట్లు నాగార్జున షాకిచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడే ఏడో దానితో ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతోంది. ముఖ్యంగా ఇది ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో రన్ అవుతుండడంతో అదిరిపోయే స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నుంచి ఏడో సీజన్ 2.Oను మొదలు పెట్టబోతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో ట్విస్టులు ఇవ్వబోతున్నారు.

ఈ ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ముందుగా నాగార్జున ఐదు వారాల్లో టాప్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని ఇంటి సభ్యులకు సూచించాడు. ఇందులో ఒక్కొక్కరూ తమకు నచ్చిన కంటెస్టెంట్ పేరు చెప్పారు. అందులో ఇద్దరు శివాజి పేరును చెప్పారు. దీంతో ఈ రౌండ్ కాస్త ఆసక్తికరంగానే సాగినట్లు అనిపించింది.
ఆ తర్వాత ప్రతి వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఒక్కొక్కరినీ సేఫ్ చేసుకుంటూ వస్తుంటారు. కానీ, ఈ ఎపిసోడ్‌లో మాత్రం ఎలిమినేషన్‌తో మొదలు పెడుతున్నట్లు నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత పవర్ అస్త్రాలను పొందిన కంటెస్టెంట్లు ఎవరిని ఎలిమినేట్ చేయాలో చెప్పాలని అన్నాడు. ఆ తర్వాత వీళ్లకు కలర్స్ నింపే ఓ టాస్కును ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.
అనంతరం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరినీ యాక్టివిటీ ఏరియాలోకి రమ్మని పిలిచాడు. అంతేకాదు, ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు అటు నుంచి అటే వెళ్లిపోతారని చెప్పాడు. ఈ క్రమంలోనే యాక్టివిటీ ఏరియాలో ఓ దెయ్యం ఆకారంలో ఉన్న మనిషి వచ్చి సేఫ్ అయ్యే కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నట్లు కూడా చూపించారు. దీంతో ఇదంతా ఆసక్తికరంగా మారిపోయింది.
ఇక, ఎలిమినేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత ఏడో సీజన్ 2.O ఎపిసోడ్ హైలైట్లను కూడా చూపించారు. ఇందులో హీరోలు సిద్దార్థ్, రవితేజలు స్టేజ్ మీదకు వచ్చి సందడి చేశారు. అలాగే, కొందరు కంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇది మాత్రం ఎంతో సందడిగా సాగినట్లు కనిపించింది. మొత్తానికి ఆదివారం ఎపిసోడ్ ఎన్నో సర్‌ప్రైజ్‌లతో రాబోతుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











