Bigg Boss Telugu 8: బిగ్ బాస్ చరిత్రలో తొలి రెడ్ కార్డ్.. ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసిన నాగార్జున
తెలుగు టెలివిజన్ రంగంలో ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతున్నాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం కొన్నే ఉంటున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. మన వాళ్లకు అస్సలు పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా దీనికి మంచి ఆదరణ లభించింది. అందుకే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ 8వ సీజన్ కూడా అదే రెస్పాన్స్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున రెడ్ కార్డుతో కలకలం రేపాడు. అసలేమైందో మీరే చూసేయండి!
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో నడుపుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇందులో ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఫలితంగా ఈ సీజన్ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను కూడా అందుకుంటోంది.

ఎన్నో అంచనాలతో ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లో మూడో వారంలో 'ప్రభావతి 2.O' టాస్కును ఇచ్చారు. ఇందులో నిఖిల్ క్లాన్, అభయ్ క్లాన్‌లలో ఎవరి దగ్గర ఎక్కువగా గుడ్లు ఉంటే వాళ్లు గెలుస్తారు. దీంతో ఇరు జట్ల సభ్యులు ఎక్కువ గుడ్లను సాధించేందుకు తెగ ట్రై చేశారు. ఫలితంగా కంటెస్టెంట్ల మధ్య చాలా ఫైటింగ్స్‌తో హౌస్‌లో రణరంగంగా కనిపించింది.
బిగ్ బాస్ షోలో గత వారం మొత్తంగా కొత్తగా వచ్చిన రూల్స్‌పై అభయ్ నవీన్ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలోనే 'నీకు బ్రెయిన్ ఉన్నదారా? బొక్కలో డెసిషన్స్ నువ్వు. అసలు మీరు మనిషికే పుట్టావా? ముగ్గురు కలిసి ఇంత మందికి ఎలా వండుతారు? దిమాక్ ఉన్నదారా నీకు' అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇదే తరహాలో ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ కనిపించాడు.
'ప్రభావతి 2.O' టాస్కులో భాగంగా జరిగిన గొడవలపై హోస్ట్ నాగార్జున సీరియస్ అవుతాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా వచ్చిన ప్రోమోలో ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అభయ్ నవీన్ బిగ్ బాస్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్లను ఈ వీడియోలో చూపించారు. తర్వాత నాగార్జున ఓ రాడ్ పట్టుకుని కోపంగా వచ్చి రెచ్చిపోయాడు.
బిగ్ బాస్ షోలో రూల్స్ ఫాలో అవడం లేదన్న కోపంతో అభయ్ నవీన్‌పై నాగార్జున సీరియస్ అయ్యాడు. అంతేకాదు, బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి రెడ్ కార్డ్ చూపించి అతడిని ఎలిమినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అభయ్ నవీన్ మోకాళ్లపై కూర్చుని క్షమాపణ అడిగాడు. అయినప్పటికీ నాగార్జున కనికరించలేదు. దీంతో ఈ ప్రోమో ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచేసింది.


Click it and Unblock the Notifications











