Bigg Boss Telugu 7: కెప్టెన్ అయిన వెంటనే శివాజికి బిగ్ షాక్.. ఫస్ట్ టైం పరువు తీసిన నాగార్జున
బుల్లితెర చరిత్రలో అతి తక్కువ షోలు మాత్రమే సంచలనాలను సృష్టిస్తూ ఉంటాయి. ఆ కోవలోకి వచ్చిన కార్యక్రమమే 'బిగ్ బాస్'. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన ఇది.. భారీ టీఆర్పీతో దేశంలోనే నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్‌లో శివాజికి హోస్ట్ అక్కినేని నాగార్జున కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అసలేమైంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

బిగ్ బాస్ ఏడో సీజన్ ఎన్నో అంచనాల నడుమ రెండు నెలల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ఉల్టా పుల్టా కాన్సెప్టును చూపిస్తుండడంతో గతంలో వాటి కంటే దీనికి ఎక్కువ స్పందన వస్తోంది. దీంతో నిర్వహకులు మరింత ఉత్సాహంగా సర్‌ప్రైజింగ్ అండ్ షాకింగ్ ట్విస్టులు ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఆరంభం నుంచీ సక్సెస్‌ఫుల్‌గానే సాగుతూ మజాను కూడా పంచుతోంది.
బిగ్ బాస్ ఇంటికి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు గానూ శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున రత్నాల టాస్కును నిర్వహించారు. ఇందులో ఇద్దరు పోటీదారులు మినహా మిగిలిన కంటెస్టెంట్లు అందరూ ఓట్లు వేశారు. అందులో అందరూ శివాజికే జై కొట్టారు. ఫలితంగా అతడు అర్జున్‌పై విజయం సాధించడంతో పాటు బిగ్ బాస్ ఇంటికి ఆరో కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.
బిగ్ బాస్ కెప్టెన్‌గా ఎంపిక అయిన శివాజి తలపై మాజీ కెప్టెన్ శోభా శెట్టి కిరీటాన్ని పెట్టింది. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తీసి ఇవ్వగా.. దాన్ని అర్జున్ కొత్త కెప్టెన్‌కు అలంకరించాడు. ఇక, తనకు ఓట్ వేసి గెలిపించిన అందరు కంటెస్టెంట్లకూ శివాజి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ఉండమని చెప్పాడు.

శనివారం ఎపిసోడ్ ప్రారంభం అయిన వెంటనే 'శివాజి మీ అబ్బాయి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అచ్చం నీలాగే ఉన్నాడు. నువ్వు హౌస్‌లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బాగా లాగేశావు. ఒళ్లు అయితే తగ్గింది కానీ.. హెడ్ వెయిట్ మాత్రం బాగానే పెరిగింది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో శివాజి అదేం లేదు.. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను అంటూ వివరణ ఇచ్చాడు.
కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శివాజికి హోస్ట్ అక్కినేని నాగార్జున కోలుకోలేని షాక్ ఇచ్చాడు. నామినేషన్స్ సమయంలో 'రాజమాతలూ ఇక మీ మూతలు పగిలిపోతాయి' అంటూ అతడు అన్న మాటలకు సంబంధించిన వీడియోను నాగార్జున చూపించాడు. దీంతో శోభా శెట్టి షాకై నోరెళ్లబెట్టేసింది. ఆమె మాత్రమే కాదు.. అది చూసిన తర్వాత శివాజి కూడా ఇబ్బంది పడిపోయాడు.
నాగార్జున ఆ వీడియోను చూపించగానే శివాజి కంగారు పడిపోయాడు. అంతేకాదు, 'బాబు గారూ.. నేను సరదాగా అన్న మాటలే అవి. గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నాను. అమ్మాయిలను ఎంతో గౌరవంగా చూస్తాను. బిగ్ బాస్‌లోనే కాదు.. ఇండస్ట్రీలో కూడా నాకు చెడ్డ పేరు లేదు' అని చెప్పుకొచ్చాడు. దీంతో నాగార్జున అతడిని హెచ్చరించాడు. మొత్తానికి కెప్టెన్ అయిన వెంటనే శివాజికి మాత్రం బిగ్ షాక్ తగిలినట్లు అయింది.


Click it and Unblock the Notifications











