Bigg Boss Telugu 8: ఒకేసారి ఇద్దరితో లేడీ కంటెస్టెంట్ ట్రాక్.. వీడియోతో పరువు తీసేసిన నాగార్జున
బుల్లితెరపై అతి తక్కువ షోలు మాత్రమే సంచలనాలను సృష్టిస్తూ ఉంటాయి. ఆ కోవలోకి వచ్చినదే 'బిగ్ బాస్'. తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన ఇది.. భారీ టీఆర్పీతో దేశంలోనే నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్‌లో సోనియాకు హోస్ట్ అక్కినేని నాగార్జున కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అసలేమైంది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
అన్‌లిమిటెడ్‌గా కొత్త సీజన్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఎన్నో అంచనాల నడుమ రెండు వారాల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాన్సెప్టును చూపిస్తుండడంతో గతంలో వాటి కంటే దీనికి ఎక్కువ స్పందన వస్తోంది. దీంతో నిర్వహకులు మరింత ఉత్సాహంగా సర్‌ప్రైజింగ్ అండ్ షాకింగ్ ట్విస్టులు ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఆరంభం నుంచీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతూ మజాను పంచుతోంది.

విష్ణుప్రియ వర్సెస్ సోనియా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో చాలా మంది కంటెస్టెంట్ల మధ్యన గొడవలు జరిగాయి. అందులో విష్ణుప్రియ, సోనియా ఆకుల మధ్య మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో ప్రతి వారం వీళ్లిద్దరూ హైలైట్ అవుతున్నారు. ముఖ్యంగా విష్ణుప్రియ చేసేది అడల్డ్ కామెడీ అని, ఆమెకు బట్టలు వేసుకోవడం తెలియదు అని, భయం చెప్పేవారు లేరని సోనియా కామెంట్లు చేసింది.
తప్పులు.. రెడ్, గ్రీన్ అంటూ
గత వారం మొత్తంలో జరిగిన పలు టాస్కుల్లో ఎన్నో పొరపాట్లు జరిగాయి. కొందరు కంటెస్టెంట్లు ఓవర్ యాక్షన్ కూడా చేశారు. అలాంటి వారికి శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు. మంచిగా ఆడిన వాళ్లకు గ్రీన్, చెత్త ప్లేయర్లకు రెడ్ మార్క్‌లు ఇచ్చారు. అలాగే, గన్ పట్టుకుని వచ్చి కొన్ని విషయాలపై కొందరిని మరీ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
సోనియాకు క్లాస్ పీకేశాడుగా
శనివారం ఎపిసోడ్‌లో సోనియాతో మాట్లాడిన నాగార్జున 'ఈ వారంలో నువ్వు ఏం ఆడావో చెప్పు' అని సూటిగా ప్రశ్నించాడు. ఆమె చాలా లిస్టే చెప్పినా ఆయన మాత్రం ఒప్పుకోలేదు. పైగా 'స్కోప్ రాదు తీసుకోవాలి.. పెద్దోడు చిన్నోడు అని సోఫాలో కూర్చుండిపోతే.. ఆటలో నేనట్లే' అంటూ పృథ్వీ, నిఖిల్‌తో సోనియా వ్యవహరిస్తున్న తీరును పరోక్షంగా వెల్లడించి షాకిచ్చాడు.
విష్ణుపై కామెంట్.. వీడియో
సోనియా ఆటతీరు గురించి మాట్లాడిన తర్వాత మాట తీరుపై నాగార్జున సీరియస్ అవుతూ వీడియో చూపించాడు. అందులో ఆమె 'నిన్ను ఎవరూ పట్టించుకోరేమో విష్ణు ప్రియా. కానీ మాకు ఫ్యామిలీ ఉంది. మాకు పట్టించుకునే వాళ్లు ఉన్నారు. ఏం చూపిస్తారో అనే ఒత్తిడి ఉంటుంది' అని మాట్లాడింది. విష్ణుప్రియ తన ఫ్యామిలీ గురించి ఆమెకు చెప్పానని నాగార్జునతో చెప్పింది.
తెలిసినా ఎలా మాట్లాడావ్
విష్ణుప్రియ గురించి తెలిసి కూడా ఫ్యామిలీని నిందించడంతో సీరియస్ అయిన నాగార్జున 'ఇంట్లో పట్టించుకునే వాళ్లు లేరా? నువ్వు అలా మాట్లాడటం కరెక్టేనా? ఆమె ఫ్యామిలీ గురించి తెలిసి కూడా.. ఆ మాట ఎలా అనగలిగావ్. నువ్వు అన్న మాటలో అర్థం ఏంటి? నీకైతే అటు పక్క పెద్దోడు కావాలి.. ఇటు పక్క చిన్నోడు కావాలి.. ఆమెకు మాత్రం ఎవరూ వద్దా' అంటూ పరువు తీశాడు.


Click it and Unblock the Notifications











