మనసు కోతి లాంటిది.. అంటూ రంగంలోకి నాగార్జున.. బిగ్ బాస్ స్టార్ట్
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.

కింగ్ సినిమా లోని కెఐఎన్‌జీ అంటూ బిగ్ బాస్ సీజన్ 3 లోకి ఎంటర్ అయ్యాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 1 బంగారు బాటలో నడిపిన ఎన్టీఆర్ కి, బిగ్ బాస్ సీజన్ 2 అదే నడిపిన నానికి ఐ లవ్ యూ అంటూ స్టార్ట్ చేశాడు నాగార్జున. మనసు కోతి లాంటిది అని చెబుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేశాడు నాగ్. నాగార్జున సినిమా పాటలతో బిగ్ బాస్ హౌస్ హోరెత్తుతోంది. బిగ్ బాస్ హౌస్ లో లివింగ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, కిచెన్, బెడ్ రూమ్ లాంటి స్పాట్స్ చూపిస్తూ సందడి చేస్తున్నారు నాగ్.


Click it and Unblock the Notifications











