Bigg Boss 7 Telugu: షోలో ప్రేమ పంచాయితీ.. రాహుల్ దెబ్బకు నాగార్జున యూటర్న్.. రతికకు హింట్ ఇచ్చాడా!
బుల్లితెరపై ఏదైనా ఒక షో ఎక్కువ కాలం ప్రభావాన్ని చూపడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటి దాన్ని సుసాధ్యం చేసుకుంటూ సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఏ షోకూ సాధ్యం కాని విధంగా టాప్ రేటింగ్‌ను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రతికా రోజ్‌కు నాగార్జున కొన్ని విలువైన మాటలు చెప్పాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు వచ్చారు. అందులో తెలుగు భామ రతికా రోజ్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆమెపై అంతా ఫోకస్ చేశారు. అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ హౌస్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ముందుకు సాగుతోంది. అలాగే, తనదైన స్ట్రాటజీతో ఆడుతూ మంచి పేరును తెచ్చుకుంది.

రతికా రోజ్ గురించి గతంలో ఎవరికీ తెలీదు. కానీ, ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లవ్ స్టోరీ బయటకు వచ్చింది. అంతేకాదు, ఆమె ప్రేమించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ అని ఓ న్యూస్ లీకైంది. ఆ తర్వాత వీళ్ల ఫొటోలు, కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, చాలా రోజుల క్రితమే వీళ్లిద్దరూ విడిపోయారు.
రాహుల్ సిప్లీగంజ్‌తో బ్రేకప్ అయిన తర్వాత కూడా రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్‌లో తరచూ అతడి గురించి పరోక్షంగా మాట్లాడుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే రాహుల్ సిప్లీగంజ్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఈ మేరకు పరోక్షంగా రతికా రోజ్ తన పేరును వాడుకుంటుందని విమర్శించాడు. దీంతో ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది.
రతికా రోజ్ - రాహుల్ సిప్లీగంజ్ వ్యవహారం శృతి మించిపోతుండడంతో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున దీనిపై స్పందిస్తూ ఈ లేడీ కంటెస్టెంట్‌కు చురకలు కూడా అంటించాడు. 'ఏమ్మా రతికా.. ఫస్ట్ వీక్ గ్రీన్‌లో ఉన్నావు. రెండో వారంలో ఎల్లోలోకి వచ్చావు. ఇప్పుడు రెడ్ కాదు.. ఎల్లో చివరి ఎడ్జ్‌లో ఉన్నావు.. నీ ఆటకు ఏమైందమ్మా' అంటూ ప్రశ్నించాడు.
ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. 'అసలు ఆ నామినేషన్స్‌లో నీ బిహేవియర్ ఏంటమ్మా? సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేస్తావా' అంటూ అడిగాడు. దీనికి రతికా 'సార్ ఆరోజు నా మనసు బాలేదు. పదే పదే నా ఎక్స్ గురించి టాపిక్ వస్తుంది. ఆ బాధతోనే ఏం చేయాలో తెలియలేదు. అందుకే అమర్‌దీప్‌ను ఫాలో అయిపోయి ఇద్దరిని నామినేట్ చేసేశా' అని చెప్పుకొచ్చింది.
రతికా మాటలకు నాగార్జున 'ఎక్స్ అంటే గతం. అయిపోయిన దానిని మర్చిపోయి గేమ్ మీద ఫోకస్ పెట్టు. నువ్వు మోసం చేసినా యావర్ చూడు నీకు తినిపించాడు' అంటూ చురకలు అంటిస్తూనే పరోక్షంగా ఎక్స్ టాపిక్ వదిలేయమని ఆమెకు హింట్ ఇచ్చాడు. దీంతో మొదట్లో రతికను రెచ్చగొట్టి.. ఆ తర్వాత రాహుల్ పోస్టు చూసి.. ఈ వ్యవహారంలో నాగార్జున యూటర్న్ తీసుకున్నాడని కొందరు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











