Bigg Boss Telugu 7: శివాజికి నాగార్జున సీక్రెట్ ఆఫర్.. ఫినాలేకు చేరేలా ప్లాన్.. కానీ అదే జరిగితే ఔట్
తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఇది.. ఇప్పుడు ఏడో దానితో వచ్చింది. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ప్రయోగాత్మకంగా సాగుతోన్న ఈ సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.
నిర్వహకులు పెట్టే టాస్కులకు తోడు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఈ రియాలిటీ షోపై ప్రేక్షకులకు మజా అందుతోంది. దీంతో షోకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టైటిల్ ఫేవరెట్ శివాజి విషయంలో నాగార్జున ఊహించని పని చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

టైటిల్ ఫేవరెట్‌గా వచ్చాడు: ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సరికొత్తగా పరిచయం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురిని కూడా వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపించారు. అయితే, ఇందులో ఆరంభం నుంచే శివాజి టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. ఆటతీరుతో పాటు తెలివితేటలతో మెప్పిస్తున్నాడు. దీంతో క్రేజ్ బాగా పెంచుకుంటున్నాడు.
గాయంతో స్లో.. టార్గెట్ చేసి: బిగ్ బాస్ టాస్క్ ఆడుతున్న సమయంలోనే శివాజి చేతికి గాయం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడి ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఫిజికల్ గేమ్‌లు ఆడలేకపోతున్నాడు. అయినప్పటికీ బుర్రకు పని చెప్తున్నాడు. కానీ, హౌస్‌లోని కంటెస్టెంట్లు మాత్రం శివాజి సమస్యను హైలైట్ చేసి అతడు ఎలిమినేట్ అవ్వాలని టార్గెట్ చేస్తున్నారు.
బిగ్ బాస్‌కు రిక్వెస్ట్ చేస్తూ: తన గాయాన్ని హైలైట్ చేస్తూ చాలా మంది విమర్శిస్తుండడంతో శివాజి తట్టుకోలేకపోతున్నాడు. దీంతో ఇంటికి వెళ్లిపోతానని రచ్చ చేశాడు. దీంతో బిగ్ బాస్ కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి విషయం అడగ్గా.. తనకు ఇబ్బందిగా ఉందని, ఇంటికి వెళ్లిపోతానని చెప్పాడు. దీనికి పెద్దాయన 'డాక్టర్లు పరిశీలించి బయట చికిత్స అవసరం అనుకుంటే పంపిస్తాము' అని స్పష్టం చేసేశాడు.

శివాజిని పంపించేస్తారని: శనివారం జరిగిన ఎపిసోడ్‌లో శివాజి ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తావన వచ్చింది. కెప్టెన్ అర్జున్ 'శివాజి అన్న హెల్త్ ఇష్యూలతో బాధ పడుతున్నారు. కాబట్టి ఆయనను ఇంటికి పంపించబోతున్నారని ఇక్కడున్న అందరు కంటెస్టెంట్లు అనుకుంటున్నారు' అని చెప్పాడు. బయట ప్రేక్షకులు కూడా అదే భావిస్తుండడంతో శివాజిని హోస్ట్ నాగార్జున కనెఫెషన్ రూమ్‌లోకి రమ్మని పిలిచాడు.
ఏమైంది చెప్పు శివాజి?: కన్‌ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన శివాజితో హోస్ట్ అక్కినేని నాగార్జున పర్సనల్‌గా మాట్లాడాడు. అప్పుడు 'అసలు నీకు ఏం జరుగుతుందో చెప్పు? ఫిజికల్‌గా ఇబ్బందిగా ఉందా? మెంటల్‌గా కూడా ఉందా?' అంటూ సూటిగా ప్రశ్నించాడు. దీనికి శివాజి 'చేయి మొత్తం లాగుతుంది. భుజం దగ్గర చాలా మంటగా ఉంటుంది. గేమ్ కూడా సరిగా ఆడలేకపోతున్నా' అని వివరించాడు.
శివాజికి సీక్రెట్ ఆఫర్: తన సమస్యను వివరిస్తున్నప్పుడు శివాజి 'చేయి కాస్త చచ్చుబడినట్లు అనిపిస్తుంది. అందుకే రోజుకు రెండు మూడు సార్లు ఫిజియో థెరఫీ చేయిస్తే బెటర్ అవుతుందని అనిపిస్తుంది. మీకు ఒక మాట చెప్పి వెళ్లిపోదాం అనుకుంటున్నా' అని అన్నాడు. దీంతో నాగార్జున 'ఆ ఫిజియో థెరఫీ ఇక్కడే చేయిద్దాం. నువ్వు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చేస్తారు' అని ఆఫర్ ఇచ్చాడు.
ఆ పరిస్థితిలో వెళ్లిపో: ఆ తర్వాత నాగార్జున 'నీకు ఫిజియో థెరఫీ చేయిద్దాం. మెరుగైన చికిత్సను చేయిద్దాం. అయినా తగ్గకపోతే అప్పుడు బిగ్ బాసే నిన్ను ఇంటికి పంపిస్తారు' అని చెప్పాడు. దీంతో శివాజి కొత్త ఉత్సాహంతో ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇక, శివాజి వెళ్తే టీఆర్పీ పడిపోతుందనే అతడిపై నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని, ఎలాగైనా ఫినాలేకు పంపాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











