Bigg Boss Telugu 7: అడ్డంగా దొరికిపోయిన శివాజి.. ఒకరి తప్పుకు మరొకరు బలి.. ఈ సీజన్‌లో తొలిసారి ఇలా!
అసలు ఏమాత్రం పరిచయమే లేని కంటెంట్‌తో వచ్చినా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని నెంబర్ వన్ షోగా మారిపోయింది బిగ్ బాస్. అందుకే తెలుగులో ఇది అస్సలు బ్రేకులు లేకుండా వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను నిర్వహకులు నడుపుతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను చూపిస్తూ ఉల్టా పుల్టాగా ప్రసారం చేస్తున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ శివాజి ఓ విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలను మీరే చూడండి!
కెప్టెన్సీ టాస్కు... ట్విస్టులతో
9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం 'హాల్ ఆఫ్ బాల్' అనే టాస్కును ఇచ్చిన సంగతి విధితమే. ఇందులో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్‌గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిలను గర్జించే పులులు జట్టుగా ఆడారు. వీళ్లకు రకరకాల టాస్కులను ఇచ్చారు. వీటిలో గౌతమ్ కెప్టెన్సీలోని వీర సింహాలు గెలిచింది.

శివాజి వార్నింగ్ ఇవ్వడంతో
ఈ కెప్టెన్సీ టాస్కు జరుగుతున్న సమయంలో ప్రతి టీమ్ సభ్యులు తాము సంపాదించుకున్న బాల్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలని బిగ్ బాస్ పదే పదే చెప్పాడు. అంటే ఎదుటి టీమ్ వాళ్లు వాటిని దొంగతనం చేయొచ్చని పరోక్షంగా వెల్లడించాడు. కానీ, ఒక టీమ్ కెప్టెన్ శివాజి మాత్రం తన బాల్స్ ఎవడూ తీసుకోడానికి వీల్లేదని గౌతమ్‌ను, టేస్టీ తేజను బెదిరించిన సంగతి తెలిసిందే.
నాగార్జున ముందే తేలుస్తాం
బాల్స్ దొంగతనం చేయడం విషయంలో తనను శివాజి బెదిరించడంతో టేస్టీ తేజ 'ఇదే విషయాన్ని నాగార్జున సార్ ముందు అడుగుదాం అన్నా' అని స్మూత్‌గానే చెప్పాడు. అయితే, గౌతమ్ కృష్ణ మాత్రం కెమెరా ద్వారా బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేశాడు. దీంతో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఇది కచ్చితంగా ప్రస్తావనకు వస్తుందని ఆడియెన్స్ అందరూ అభిప్రాయానికి వచ్చేశాడు.

నాగార్జున కూడా సపోర్టుగా
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున 'ఈ వారం చాలా మంది నాగ్ సార్ ముందు తేల్చుకుందాం అన్నారు. ఇప్పుడు చెప్పండి' అన్నాడు. దీంతో తేజ 'బాల్స్ మేము దొంగతనం చేద్దామని అనుకుంటే శివాజి అన్న బెదిరించాడు. ఇంతకీ అవి దొంగిలించవచ్చా లేదా' అని అడిగాడు. దీంతో నాగార్జున 'జాగ్రత్తగా దాచుకోండి అంటే దొంగతనం చేస్తారనే కదా' అని చెప్పేశాడు.
శివాజికే మద్దతుగా చెప్పి
ప్రత్యర్థి టీమ్ వాళ్లు సంపాదించుకున్న బాల్స్‌ను దొంగతనం చేయొచ్చు అని చెప్పిన నాగార్జున.. శివాజిని సైతం సపోర్టు చేసి మాట్లాడి షాకిచ్చాడు. ఆయన తరపున లాయర్ మాదిరిగా 'మీరు దొంగతనం చేయకుండా శివాజి బెదిరించాడు. ఇది అతడి స్ట్రాటజి. మరి ఆయన మాటలకు మీరెందుకు ఆగిపోయారు? బెదిరిస్తే ఆగిపోతే అది గేమ్ ఎలా అవుతుంది' అని ప్రశ్నించాడు.

ఎర్రిబాగులోడివి నువ్వేగా
ఆ తర్వాత నాగార్జున 'గౌతమ్ నిన్ను కూడా శివాజి అలాగే అన్నాడు. మరి నువ్వెందుకు ఆగిపోయావు' అని అడిగాడు. అప్పుడు శోభా 'నేను ఏదైతే అది అవుతుంది వెళ్దాం అన్నాను సార్. వీళ్లే రాలేదు' అని చెప్పింది. దీంతో నాగార్జున 'శివాజి స్ట్రాటజీ ప్లే చేశాడు. దానికి మీరు పడిపోయారు. ఇందులో తేజనే ఎర్రిబాగులోడు అయ్యాడు' అంటూ ఈ ఇష్యూకు ముగింపు పలికాడు.
అడ్డంగా దొరికిన శివాజి
బాల్స్ విషయంలో స్ట్రాటజీ చేశాడని నాగార్జున అన్న వెంటనే శివాజి 'అవును స్ట్రాటజీనే. మరి మీకు బాల్స్ ఇచ్చేస్తామా' అని తేజతో అన్నాడు. వాస్తవానికి ఆ టాస్కులో అతడు కోపంగానే ఈ విషయంపై స్పందించాడు. నిజంగానే వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ, నాగార్జున స్ట్రాటజీ అనడంతో వెంటనే మాట మార్చాడు. ఈ విషయం శనివారం ఎపిసోడ్ చూసిన వాళ్లకు అర్థం అయింది. మొత్తంగా శివాజి తప్పు చేయడం.. దాన్ని నాగార్జున డైవర్ట్ చేయడంతో టేస్టీ తేజ బలైపోయాడు.


Click it and Unblock the Notifications











