Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం.. అలా శివాజి ఎలిమినేట్.. నాగార్జున ట్విస్ట్‌తో షాక్
అసాధారణ రెస్పాన్స్‌తో తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ మన భాషలోకి పరిచయం అయిన ఈ షోకు.. చాలా తక్కువ సమయంలోనే వీపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. అంతేకాదు, ఇటీవలే ఏడో సీజన్‌ను సైతం ప్రారంభించారు. ఇందులో సరికొత్త ప్రయోగాలను చేస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజికి హోస్ట్ నాగార్జున కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ వివరాలను మీరే చూడండి!
ఉల్టా పుల్టా కంటెంట్‌తో ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పవర్ అస్త్ర అనే కాన్సెప్టును తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రతి వారం దీనికోసం టాస్కులు ఇస్తుండగా.. అది గెలిచిన వాళ్లు కన్ఫార్మ్ కంటెస్టెంట్ అవడంతో పాటు ఇమ్యూనిటీని కూడా పొందుతున్నారు. ఇలా నాలుగు వారాల్లో సందీప్, శివాజి, శోభా శెట్టి, ప్రశాంత్‌లు పవర్ అస్త్రాలను గెలిచారు.

పవర్ అస్త్రాలను గెలుచుకుని ఊపరి పీల్చుకునే వీలు లేకుండా వాళ్ల పెర్ఫార్మెన్స్‌లను కూడా నాగార్జున బేరీజు వేస్తున్నాడు. ఇలా గత వారంలో సందీప్ మాస్టర్ బ్యాటరీని డౌన్ చేశాడు. ఆ తర్వాత కూడా దాన్ని అందరూ సరిగా కాపాడుకోవాలని సూచించాడు. ఇలాంటిది తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఊహించని నిర్ణయం తీసుకుని అదిరిపోయే ట్విస్టునే ఇచ్చాడు.
గత వారం జరిగిన టాస్కులో టేస్టీ తేజ.. గౌతమ్ కృష్ణను బెల్టుతో పలుమార్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ సంఘటనపై తనదైన రీతిలో స్పందించి తేజను ఉతికి ఆరేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న సంచాలకులు శివాజి, సందీప్‌పై ఫైర్ అయిపోయాడు.
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి సందీప్, శివాజి, శోభా శెట్టిలలో అనర్హత కలిగిన హౌస్‌మేట్ ఎవరో చెప్పాలని అడిగాడు. ఇందులో సందీప్‌కు 3 ఓట్లు, శివాజికి మూడు ఓట్లు వచ్చి టై అయింది. దీంతో వీళ్లిద్దరిలో పవర్ అస్త్రాన్ని ఉంచుకోడానికి అనర్హులు ఎవరో చెప్పాలని మరోసారి ఓటింగ్ పెట్టాడు.
ఈ ఓటింగ్‌లో మాత్రం సందీప్ మాస్టర్‌కు మూడు ఓట్లే వచ్చాయి. కానీ, శివాజి అనర్హుడు అని ఏకంగా 9 మంది చేతులు లేపారు. దీంతో హోస్ట్ నాగార్జున అతడిని హౌస్‌మేట్‌గా ఉండడానికి అనర్హుడు అని ప్రకటించాడు. అంతేకాదు, గతంలో గెలుచుకున్న శివాజి పవర్ అస్త్రాన్ని తెప్పించి పగలగొట్టించాడు. దీంతో ఇకపై శివాజికి ఎలాంటి సౌకర్యాలు కూడా లభించవని చెప్పాడు.
శివాజి పవర్ అస్త్ర విషయంలో నాగార్జున ఇచ్చిన ట్విస్టుకు అక్కడున్న వాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. కన్ఫార్మ్ హౌస్‌మేట్‌గా అతడు ఎలిమినేట్ అవడంతో ఈ వారం నామినేషన్స్‌లో కూడా ఉండనున్నాడు. దీంతో ఇప్పుడు ఆట మరింత రంజుగా మారబోతుంది. ఇక, ఈ పరిణామం మిగిలిన హౌస్‌మేట్లకు కూడా గట్టి వార్నింగ్‌లా పని చేయబోతుందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











