నాగ్ ప్లాన్ చూస్తుంటే బిగ్‌బాస్‌కి నిజంగానే బ్రేక్ ఇచ్చేలా ఉన్నాడు
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ను అంధరికంటే ముందే స్టార్ట్ చేశాడు కింగ్ నాగార్జున. నాగ్ మొదలుపెట్టిన తరువాత సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ కూడా వారి స్థానిక భాషల్లో దైర్యంగా షోను పట్టాలెక్కించారు. అంత బాగానే ఉంది. గాని తెలుగులో నాగార్జున షోకి కొంత బ్రేక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా టాక్ వస్తోంది. నిజానికి ఆ రూమర్స్ గురించి తెలుసుకున్న తరువాత కొంత అనుమానం అయితే కలుగుతోంది.

వీకెండ్ లో పవర్ఫుల్ రేటింగ్స్..
తెలుగు బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ కి వీకెండ్స్ లోనే అత్యదిక రేటింగ్స్ అందుతున్నాయి. అందుకు ముఖ్య కారణం నాగార్జున. శని ఆదివారాలను నాగ్ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఒకరోజు ఎలిమినేషన్స్ తో హౌజ్ లో వాతావరణాన్ని వేడెక్కిస్తూ మరో రోజూ ఫన్ డే అంటూ ఆటపట్టిస్తున్నారు. ఒక విధంగా నాగ్ ప్రతి వారం షోకి మంచి బూస్ట్ ఇస్తున్నాడనే చెప్పాలి.

బ్రేక్ ఇవ్వక తప్పడం లేదట
గత ఏడాది కూడా నాగార్జున ఇదే ఊపులో షోని ఒక స్థాయిలో నెలబెట్టాడు. కానీ ఒకానొక సందర్భంలో షూటింగ్ పనుల వలన కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు రమ్యకృష్ణని మధ్యలోకి లాగాడు. ఆమె హోస్ట్ గా బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సారి కూడా మన్మథుడు షోకి కొంత బ్రేక్ ఇవ్వక తప్పడం లేదట. దాదాపు రేండు వారాల పాటు షోను మిస్సయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

వైల్డ్ డాగ్ కోసం 20రోజుల పాటు
ఎందుకంటే ముందు అనుకున్న కమిట్మెంట్ ప్రకారం నాగార్జున తదుపరి సినిమా వైల్డ్ డాగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. అసలైతే ఇండియాలోనే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ షెడ్యూల్ ప్లాన్ ప్రకారం థాయిల్యాండ్ వెళ్లాల్సి వస్తోంది. అక్కడే దట్టమైన అడవుల్లో కీలక సన్నివేశాలను 20రోజుల పాటు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

నాగార్జున స్థానంలో వచ్చేదెవరు?
ఇక నాగార్జున దాదాపు రెండు వారాలతో పాటు ఒక శనివారాన్ని కూడా మిస్సయ్యే ఛాన్స్ ఉంది. దీంతో నాగార్జున గ్యాప్ ని ఎవరు మ్యానేజ్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య అనుష్క రానున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్దాలని తేలిపోయింది. ఇక ఇప్పుడు మరొకరిని లైన్ లో పెట్టాలని బిగ్ బాస్ నిర్వాహకులు స్పెషల్ ప్లాన్ వేసినట్లు టాక్ వస్తోంది. ఇక ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడాలి అంటే మరికొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











