For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Finale మీరు ముద్దులిస్తే నిద్ర పట్టట్లేదంటూ ఫైమా షాకింగ్ గా!.. రాధతో బాలాదిత్య స్టెప్పులు

  |

  సుమారు 104 రోజులుగా తెలుగు ప్రేక్షకులను ఎన్నో విధాలుగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన అత్యంత పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ చివరి అంకానికి చేరువైంది. 105వ రోజు అయిన డిసెంబర్ 18 ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలేను ఘనంగా నిర్వహించి ఈ ఆరో సీజన్ టైటిల్ విన్నర్ ను మాజీ కంటెస్టెంట్స్, సెలబ్రిటీలతోపాటు అశేష ప్రేక్షకులు చూస్తుండగా ప్రకటించి.. ట్రోఫీని అందజేయనున్నారు. గ్రాండ్ ఫినాలే అంటే ఆద్యంతం ఎంటర్టైనింగ్ ఉంటుంది. అందుకోసం సెలబ్రిటీలతో ఫినాలేను సందడిగా మారుస్తారు. అందులో భాగాంగానే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ గ్రాండ్ ఫినాలేకు అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు హీరో నిఖిల్ సిద్ధార్థ్, రవితేజ, శ్రీలీల సందడి చేసేందుకు హాజరయ్యారు.

  సెలబ్రిటీల ఎంట్రీ..

  సెలబ్రిటీల ఎంట్రీ..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ రేవంత్, శ్రీహాన్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి ఉన్నారు. ఇవాళగ్రాండ్ గా ఫినాలే జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల, అలనాటి స్టార్ హీరోయిన్ రాధ, హీరో నిఖిల్ సిద్ధార్థ్ తోపాటు ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించడానికి బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌటేలా దర్శనం ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

  తమన్నాకు కూడా ఇదే..

  తమన్నాకు కూడా ఇదే..


  బిగ్ బాస్ స్టేజిపైకి సీనియర్ హీరోయిన్ రాధ ఎంట్రీ ఇచ్చింది. రావడం కూడా స్టెప్స్ తోనే వస్తున్నారా అని నాగార్జున అడిగితే.. స్టెప్స్ లేకుండా నడవడం నా వల్ల కాదు. నాలుగో తరగతి నుంచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. అంటే.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అని రాధ చెప్పారు. తర్వాత మీకు నేను పెద్ద ఫ్యాన్ అని బాలాదిత్య అంటే.. మొన్న తమన్నా వచ్చినప్పుడు ఇదే చెప్పాడని నాగార్జున అన్నాడు.

  చిరంజీవి గ్రేస్ తో బాలాదిత్య..

  చిరంజీవి గ్రేస్ తో బాలాదిత్య..

  అనంతరం స్టేజీపై చిరంజీవి పాటకు బాలాదిత్య, రాధ కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టారు. చిరంజీవి హావాభావాలను బాలాదిత్య దించేశాడు. వాళ్ల డ్యాన్స్ చూస్తూ మరింత ఎంకరేజ్ చేశాడు నాగార్జున. తర్వాత అందరం కలిసి డ్యాన్స్ చేద్దామని రాధ అంటే.. ఒక డ్యాన్స్ గ్రూప్ తో హౌజ్ లోపలికి వెళ్లిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంటి సభ్యులతో కలిసి డ్యాన్స్ చేశాడు.

  నా ఫస్ట్ రెమ్యునరేషన్..

  నా ఫస్ట్ రెమ్యునరేషన్..

  ఇక స్టేజిపై రవి నాకు ఎప్పటి నుంచి తెలుసో నీకు తెలుసా అని శ్రీలీలను నాగార్జున అడిగాడు. అందుకు రవితేజ.. నా ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ పై సంతకం పెట్టింది ఈయనే అని చెప్పాడు. అది నేను దాచుకుందామనుకున్నాను కానీ అప్పుడు అవసరమొచ్చి వాడేశాను అని రవితేజ అన్నాడు. నీకు ఫస్ట్ చెక్ మాత్రమే కాదు.. ఒక బ్రీఫ్ కేస్ కూడా ఇవ్వబోతున్నాను అని నాగార్జున అనగానే స్టేజిపైకి ఒక బ్రీఫ్ కేస్ దిగింది.

  మంచి టెంప్టింగ్ ఆఫర్..

  మంచి టెంప్టింగ్ ఆఫర్..

  ఆ బ్రీఫ్ కేస్ తో లోపలకి వెళ్లిన రవితేజ.. మ్యాటర్ ఏంటంటే.. ఒక మంచి టెంప్టింగ్ ఆఫర్ తీసుకొచ్చాను. బంఫర్ ఆఫర్. అది తీసేసుకుంటే వెళ్లిపోవచ్చు అని రవితేజ అన్నాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరు అని నాగార్జున అనగా.. హౌజ్ లోపల హీరో నిఖిల్ ఒక హ్యాట్ తో కనిపించాడు. దాన్ని ఐదుగురు ఇంటి సభ్యుల్లో ఒకరికి పెట్టాలి. అప్పుడు ఒక్కొక్కరిగా వెళ్తుంటే నాకు మీ సినిమాలంటే చాలా ఇష్టం అని శ్రీహాన్ అన్నాడు. అయితే ఈ హ్యాట్ ను ఎలిమినేట్ అయ్యే మరొక కంటెస్టెంట్ కు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

   నేను ఒక్కన్నే అనుకుంటున్నా..

  నేను ఒక్కన్నే అనుకుంటున్నా..

  ఇదిలా ఉంటే అంతకుముందు.. నువ్ కాకుండా ఈ 21 మందిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని ఆదిరెడ్డిని నాగార్జున అడిగారు. దానికి కష్టం సార్ నేను ఒక్కన్నే అనుకుంటున్నా అని నవ్వించిన ఆదిరెడ్డి.. చివరిగా ఫైమా పేరు చెప్పాడు. ఎందుకు తనకు ఇది ఇస్తున్నావని నాగార్జున అని అడిగితే.. సర్ బాగా డ్యాన్స్ చేస్తుందని ఆదిరెడ్డి అన్నాడు. అప్పుడు ఫైమా చేతిని ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు నాగార్జున.

  ఉలిక్కిపడిన ఫైమా..

  ఒక్కసారిగా నాగార్జున ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించగా ఫైమా ఉలిక్కి పడింది. సార్ నాకు నిద్ర పట్టట్లేదు సార్.. మీరు ముద్దులిస్తే అని ఫైమా షాకింగ్ గా చెప్పింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ తెగ నవ్వేశారు. తర్వాత చిరంజీవి బాసు పార్టీ సాంగ్ కు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా వచ్చి తన డ్యాన్స్ తో అలరించింది.

  English summary
  Nagarjuna Tried To Kiss Jabardasth Faima Hand And Baladitya Dance With Radha In Bigg Boss Telugu 6 Grand Finale December 18
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X