Bigg Boss Telugu 8: నాగ మణికంఠ అమ్మాయితో అసభ్యంగా.. సీక్రెట్‌గా ఇచ్చిపడేసిన నాగార్జున

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ద్వారా ఇండియాలోకి వచ్చి.. ఆ తర్వాత తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్. హిందీలో సక్సెస్ అయినా.. మన దగ్గర ఈ షో విజయం సాధించే పరిస్థితులు లేవన్న టాక్ వచ్చింది. కానీ, అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల ఆదరణను సైతం సొంతం చేసుకుంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇటీవలే ఎనిమిదో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులో నాగ మణికంఠ అసభ్యంగా ప్రవర్తించడంతో అతడికి నాగార్జున షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసమే!

సాధారణంగా బిగ్ బాస్ షో మొదలవుతుంది అనగానే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అలాంటిది అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీజన్ అయితే ఇంకెంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ఆడియెన్స్‌కు మరింత వినోదం కూడా అందిస్తోంది.

Nagarjuna Warning to Naga Manikanta about Yashmi Issue in Bigg Boss Show

గత వారం జరిగిన నామినేషన్స్ ఎంతో రచ్చగా జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యష్మీ గౌడ, నాగ మణికంఠ మధ్య పెద్ద గొడవే జరిగిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అవడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, ఈ సీజన్‌లో తాను ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు మణికంఠను నామినేట్ చేస్తానని యష్మీ చెప్పింది. ఇది హాట్ టాపిక్ అయిపోయింది.

యష్మీ గౌడతో నామినేషన్స్‌లో గొడవ జరిగిన తర్వాత నాగ మణికంఠ ఆమె దగ్గరకు వెళ్లి వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు. అంతేకాదు, 'నామినేషన్స్ అంతే ఎక్కువగా ఆలోచించకు' అని చెప్పాడు. ఆ సమయంలోనే యష్మీ గౌడ చాలా సేపు ఏడుస్తూ కనిపించింది. అలాగే, 'నాకు కంఫర్ట్ లేదని చెప్పినా హగ్ చేసుకుంటున్నాడు' అని చెప్పింది. దీనిపై నాగార్జున స్పందించాడు.

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున గత వారం ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో కోపంగా కనిపించాడు. ముందుగా అందరికీ ఓ రేంజ్‌లో క్లాస్ పీకేశాడు. ఇందులో భాగంగానే చివర్లో నాగ మణికంఠను కన్ఫెషన్‌ రూమ్‌ లోపలికి రమ్మన్నాడు. గతంలో మాదిరిగా కాకుండా అక్కడ అతడితోనే కొన్ని విషయాలను సీక్రెట్‌గా మాట్లాడాడు.

నాగ మణికంఠతో మాట్లాడిన తర్వాత నాగార్జున.. యష్మీ గౌడతో అతడు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను చూపించాడు. దీనిపై మాట్లాడుతూ.. 'మణి నువ్వు ఆమె కంఫర్ట్ లేకపోయినా హగ్ చేసుకున్నావు. ఇది మాత్రమే కాదు.. నీ వీడియోలు చాలా ఉన్నాయి. కానీ మేము చూపించడం లేదు. నువ్వు ఎందుకు వచ్చావో ఆ పనే చూసుకో' అంటూ సీరియస్ వార్నింగ్‌నే ఇచ్చాడు. దీంతో మణికంఠ 'తప్పు అయిపోయింది సార్. ఇంకెప్పుడూ రిపీట్ కానివ్వను' అంటూ చెప్పాడు. మొత్తానికి ఇప్పటికైనా అతడిలో మార్పు వస్తుందో లేదో అని పలువురు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X