సోహైల్, మెహబూబ్‌కు గట్టిగా తలంటిన నాగార్జున, ఇంకోసారి రిపీటైతే కొరడా దెబ్బలేనని హెచ్చరిక
బిగ్‌బాస్ ఇంటిలో ఐదోవారాంతంలో ఇంటి సభ్యులుకు బిగ్‌బాస్, హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాస్ పీకారు. ఇంటి సభ్యుల తీరును తప్పుపట్టారు. అంతేకాకుండా ప్రవర్తన సరిగా లేదని చెప్పారు. వేదికపైన నాగార్జున ఉండి ఇంటిలోని సభ్యులను పేరు పేరున నిలబెట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే కొన్ని ఫన్ గేమ్స్‌తోపాటు ఇంటి సభ్యుల మధ్య వినోద భరితమైన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

నిద్రలో నుంచి లేపి బిగ్ బాస్ క్లాస్
మంచి నిద్రలో ఉన్న ఇంటి సభ్యులను ఉదయాన్ని లేపి బిగ్‌బాస్ దారుణంగా క్లాస్ తీసుకొన్నారు. ఐదు వారాలు దాటినా గానీ ఇంటి సభ్యులు సరిగా మైక్ ధరించడం లేదు. పలుమార్లు హెచ్చరించినా సభ్యులు తెలుగులో మాట్లాడటం లేదు. ఇక వార్నింగులు ఉండవు. ఏకంగా శిక్షనే ఉంటుంది. కెప్టెన్ సోహైల్ కూడా ఇంటి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి అందుకు శిక్షగా ఇంటిలో ప్రతీ కెమెరాకు క్షమాపణ చెప్పాలని బిగ్‌బాస్ సూచించాడు.

ఆల్ రౌండర్‌గా మోనాల్ ఎంపిక
ఆ తర్వాత ఇంటిలో ఓపో మొబైల్ ఫోన్ పేరిట షో జరిగింది. ఏడుగురు ఇంటి సభ్యులు ప్లకార్డు సూచించి అందులో ఉన్న పదాన్ని ఇంటిలోని వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని సూచించే విధంగా ఉంటే వారికి ఇవ్వాలి. ఈ పోటీలో ఆల్‌రౌండర్‌గా మోనాల్ ఎంపికైంది.

అఖిల్, అభిజిత్‌కు నాగ్ వార్నింగ్
ఇక నాగార్జున వేదికపై నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో మోనాల్ గురించి జరిగిన గొడవపై అఖిల్, అభిజిత్‌ను నాగార్జున క్లాస్ తీసుకొన్నారు. థర్డ్ పార్టీ పేరును వాడేటప్పుడు కనీసం ఆమె గురించి ఆలోచించలేదు. ఈ విషయంలో మీరిద్దరూ తప్పు చేశారని నాగ్ అన్నారు. ఇద్దరిలో తప్పు ఎవరిది అని మోనాల్‌ని అడిగితే ఇద్దరిది అని అన్నారు.

సోహైల్‌కు కొరడా చూపించి హెచ్చరిక
ఇంటిలో సోహైల్ తీరుపై నాగార్జున మండిపడ్డారు. నామినేషన్ ప్రక్రియలో దివిపై ఎందుకు అలా అరిచావు. అంత గట్టిగా అరవడానికి కారణం ఏమిటి? ఎవరైనా నామినేట్ చేస్తే అలా అరుస్తావా? ముఖ్యంగా ఆడవాళ్లపై అరవడం చాలా తప్పు. ఇంకోసారి అలా అరిస్తే కొరడా దెబ్బలు తప్పవు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
Recommended Video

ఇంటి సభ్యులతో అలా మాట్లాడుతావా మెహబూబ్ కొరడా దెబ్బ
ఇక ఇంటిలో పుచ్చలు ఎగిరిపోతాయంటూ బీబీ హోటల్ టాస్క్‌లో హంగామా చేసిన మెహబూబ్‌ను గట్టిగా తలంటాడు. పుచ్చలు ఎగరగొడవుతా? నీ ఫ్రెండ్స్, ఇంటి సభ్యులతో అలానే మాట్లాడుతావా? ఇంకోసారి అలాగా మాట్లాడితే జాగ్రత్త. ఈ కొరడాకు పని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇంటిలో మాట్లాడాల్సిన భాష గురించి ముందే మీకు నిబంధనలు చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మసలుకోండి అంటూ నాగార్జున హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











