Bigg Boss Telugu 5 దారుణంగా పడిపోతున్న రేటింగ్.. ప్రేక్షకులు ముఖం చాటేయడానికి కారణం అదేనా?

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. టెలివిజన్ రేటింగ్స్‌ను జాతీయ స్థాయిలో ప్రభావితం చేసిన షోగా పేరు తెచ్చుకొన్నది. ప్రతీ సీజన్‌కు రేటింగ్‌ను మెరుగు పరుచుకొంటూ ముందుకు సాగింది. అయితే బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటి షోకు ఆరంభంలో భారీగానే స్పందన లభించింది. వారాలు గడుస్తున్న కొద్ది రేటింగ్‌ భారీగా దిగజారుతున్నది. అయితే కంటెస్టెంట్ల సేఫ్ గేమ్‌, గ్రూప్ కార్యకాలపాల కారణంగానే టీఆర్పీ దారుణంగా క్షీణిస్తుందనే మాట వినిపిస్తున్నది. 2021 ఏడాదిలో 41న వారం రేటింగ్స్ ఇలా ఉన్నాయి.

కంటెంట్ క్రియేషన్‌లో విఫలం

కంటెంట్ క్రియేషన్‌లో విఫలం

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో కంటెస్టెంట్లలో సగానికిపైగా సెలబ్రిటీలు టాస్కుల సమయంలో ఇష్టం లేని విధంగా ప్రవర్తించడం, తమకు పట్టనట్టుగా వ్యవహరించడం కనిపిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా షణ్ముఖ్ బ్యాచ్ మాత్రం ఎలాంటి కంటెంట్‌ను క్రియేట్ చేయకుండా షోను నిరాశాజనకంా మార్చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఇంకా చాలా మంది ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వలేకపోవడంతో ఈ షోకు ముఖం చాటేస్తున్నారనే విషయం తాజా రేటింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.

ఆ ముగ్గురి ఎలిమినేసన్ తర్వాత

ఆ ముగ్గురి ఎలిమినేసన్ తర్వాత

గత ఆరు ఎలిమినేషన్లలో దాదాపు ఐదుగురు లేడి కంటెస్టెంట్లను బయటకు పంపించడం కూడా గ్లామర్ పరంగా షోకు ప్రతికూలంగా మారిందనే మాట వినిపిస్తున్నది. ఇంటిలో బాగా రాణిస్తున్న శ్వేత వర్మ, లహరి షారి, హమీదా లాంటి వాళ్లను ఇంటి నుంచి బయటకు పంపించి.. ఏ మాత్రం కంటెంట్ క్రియేట్ చేయని వాళ్లతో షోను కొనసాగించడమే రేటింగ్ పడిపోవడానికి కారణమని తెలుస్తున్నది. శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్ జోష్ అందుకొంటున్న సమయంలో హమీదా ఎలిమినేట్ కావడం షోకు మరో మైనస్‌గా మారింది. ఆ ఫలితమే తాజా రేటింగ్ ద్వారా స్పష్టమవుతున్నది.

వారం రోజుల బిగ్‌బాస్ తెలుగు 5 రేటింగ్

వారం రోజుల బిగ్‌బాస్ తెలుగు 5 రేటింగ్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో స్టార్ మా ఛానెల్‌లో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతున్నది. ఈ షో రేటింగ్ విషయానికి వస్తే.. 40వ వారంలో అర్బన్ ప్రాంతంలో 5.13 రేటింగ్‌ను సొంతం చేసుకోగా, 41వ వారంలో 4.27 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 40 వారంలో 3.04 రేటింగ్ వస్తే.. 41వ వారంలో 2.69 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ రేటింగ్

నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ రేటింగ్


అలాగే నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వీకెండ్ షోలు అంటే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే రెండు రోజుల రేటింగ్ ఇలా ఉంది. అర్బన్ ప్రాంతంలో 40వ వారంలో 10.03 రేటింగ్'ను సొంతం చేసుకొంటే 41వ వారం అంటే గతవారం 8.77 రేటింగ్‌ను సాధించింది. ఇక రూరల్ ప్రాంతంలో 40వ వారంలో 6.98 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 41వ వారంలో 5.70 రేటింగ్‌ను సాధించింది.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
దసరా నవరాత్రి షో రేటింగ్ ఇలా..

దసరా నవరాత్రి షో రేటింగ్ ఇలా..

ఇక దసరా పండుగ నేపథ్యంలో నిర్వహించిన నవరాత్రి స్పెషల్ షోకు ఓ మోస్తారుగా రెస్పాన్స్ వచ్చింది. దాదాపు నాలుగు గంటలకుపైగా సాగిన ఈ షో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. అయితే ఈ నవరాత్రి స్పెషల్‌కు అర్బన్ ప్రాంతంలో 7.68 రేటింగ్ రాగా, రూరల్ ప్రాంతంలో 7.26 రేటింగ్ నమోదైంది. అయితే ఓవరాల్‌గా ఆశించినంతగా ప్రేక్షకుల మెప్పించలేకపోతున్నదనే విమర్శలను బలపరుస్తూ రేటింగ్స్ కూడా దిగజారుతుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X