Big Boss 7 Telugu:నాగ్ ఇక నాలుగైదేళ్లు సినిమాలు చేయకున్న పర్లేదు..బిగ్‌బాస్‌కి ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో ?
తెలుగులో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న షో అంటే... బిగ్ బాస్ అని చెప్పవచ్చు. ప్రతి ఏడాది ఈ షో కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే ఆరు సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో... ఇప్పుడు ఏడో సీజన్ కోసం రంగం సిద్ధం అయింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సీజన్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ షోకు హోస్ట్ గా వ్యవహారిస్తున్న నాగార్జున రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త హల్ చేస్తోంది. ఆయన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్టీఆర్ తో మొదలైన ఈ షో... ఆ తర్వాత నాని హోస్ట్ గా చేశాడు. ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి అయ్యాయి. ఇక ఏడవ సీజన్ కోసం రంగం సిద్దం చేశారు. ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసినట్లు రోజూ లీక్స్ బయటకు వస్తున్నాయి. వారి రెమ్యూనరేషన్ విషయాలు కూడా బయటకు వచ్చి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

అయితే గత ఆరో సీజన్ పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. బోరింగ్ గా ఉందంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అసలు బిగ్ బాస్ లోకి సెలబ్రెటీలను తీసుకు రావాలి కానీ... సెలబ్రెటీ అవ్వడానికి బిగ్ బాస్ షోకు తీసుకు వస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఏడో సీజన్ కోసం.. పక్కా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు మేకర్స్. అందరూ తెలిసిన వారినే ఎంపిక చేసినట్లు.. జనాల్లో క్రేజ్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ షోలో పాల్గొనే వారి లిస్టు ఇదే అంటూ సోషల్ మీడియాలో పేర్లు హల్ చల్ చేస్తుంది. ఇక బిగ్ బాస్ షో నుంచి రిలీజ్ అయిన ప్రోమో కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్టుతో ఊహకు అందకుండా ఈ సీజన్ ఉండబోతుందని ప్రోమో చూస్తేనే అర్థం అవుతుంది. ఇక ఈ ప్రోమోలో నాగ్ ఉల్టా పుల్టా అంటూ డైలాగ్ చెప్పుకోస్తాడు. ఈసారి డిఫరెంటుగా చేయబోతున్నట్లు అర్థం అవుతుంది.

అయితే ఈ బిగ్ బాస్ షో గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నాగార్జున రెమ్యూనరేషన్ గురించి బయట సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ చేయడానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలిస్తే మీరు కూడా వామ్మో అంటారు. నాగార్జున ఈ షో కోసం 200 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారని సమాచారం.

దీనితో నాగార్జున రెమ్యూనరేషన్ విన్నవారు... ఇక ఆయన ఒక 4,5 ఏళ్ల వరకు సినిమాలు చేయకున్నా పర్లేదు అంటున్నారు. ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఈ షోతో త్వరలో బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ షో సెప్టెంబర్ నెలాఖరులో ప్రారంభం కానుందని సమాచారం. ఇక ప్రస్తుతం నాగార్జున.. బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











