నాగబాబు మాటలతో ఏడుపొచ్చింది.. జబర్దస్త్ అభి కామెంట్స్

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్ ఎందరికో మంచి లైఫ్ ఇచ్చింది. కామెడీ స్కిట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే గాక సినిమాల్లోకి అడుగుపెట్టిన వారూ ఉన్నారు. భారీ టీఆర్‌పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న ఈ షోలో జడ్జెస్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. పార్టిసిపెంట్స్ వేస్తున్న పంచులకు జడ్జ్ స్థానంలో కూర్చున్న నాగబాబు నవ్వులు బుల్లితెర ఆడియన్స్‌కి మంచి కిక్కిస్తాయి. ఇక షో సంగతి పక్కన బెడితే.. జబర్దస్త్ పార్టిసిపెంట్స్ తో మంచి రిలేషన్ కొనసాగిస్తుంటారు నాగబాబు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ అభికి ఫోన్ ఓ సందర్భంలో ఫోన్ చేసి ఏడిపించారట నాగబాబు. ఇంతకీ ఆయన ఏమన్నారు.. అభి ఎందుకు ఏడ్చాడు? వివరాల్లోకి పోతే..

జబర్దస్త్‌లో అదిరే అభిగా గుర్తింపు

జబర్దస్త్‌లో అదిరే అభిగా గుర్తింపు

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్ ప్రోగ్రాంలో అభి వేసే స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో అతను, అతని టీమ్ పర్‌ఫార్‌మెన్స్ చూసి జడ్జెస్ సహా టీవీ ముందు కూర్చున్న ఆడియన్స్ అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. అతితక్కువ కాలంలోనే అభికి జబర్దస్త్ వేదికపై మంచి గుర్తింపు వచ్చింది.

 డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్ కారణంగా

డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్ కారణంగా

నాభిలో మరో టాలెంట్ కూడా ఉందట. ఎప్పటికైనా దర్శకత్వ శాఖలో పనిచేయాలని ఆయన కోరిక. డైరెక్షన్‌పై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఎక్కువగా అదే ఆలోచనలో ఉంటారట అభి. అయితే ఆ దిశగా అడుగులు వేద్దామని ప్రయత్నించినా ఎక్కడా సరైన అవకాశం లభించడం లేదట. ఈ సంగతులు అభినే స్వయంగా చెప్పాడు.

ఓ రోజు నాగబాబు కాల్ చేసి

ఓ రోజు నాగబాబు కాల్ చేసి

అయితే తన ఇంట్రెస్ట్ పసిగట్టిన నాగబాబు ఓ రోజు కాల్ చేసి ఓ కంటెంట్ పై ఒక వీడియో రూపొందించి ఇవ్వమన్నారని.. అయితే ఆయన చెప్పినట్లుగానే ఆ వీడియో తయారు చేసి నాగబాబు చేతిలో పెట్టానని అభి చెప్పాడు. తాను చేసిన వీడియో చూసిన నాగబాబు.. రెండు రోజుల తరువాత ఫోన్ చేసి వీడియో చాలా బాగా వచ్చిందని కితాబిచ్చారని అభి చెప్పుకొచ్చాడు.

నాగబాబు ఆ మాట అనగానే.. ఏడుపొచ్చింది

నాగబాబు ఆ మాట అనగానే.. ఏడుపొచ్చింది

అయితే వీడియో చూసిన నాగబాబు.. ''సూపర్ గా వచ్చింది.. ఆర్టిస్టుగా నీలో ఎంత టాలెంట్ ఉందో, దర్శకుడిగా అంతకు మించి టాలెంట్ ఉంది. ఏదో ఒక రోజున తప్పకుండా మంచి డైరెక్టర్ అవుతావు'' అని చెప్పడంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. వెంటనే ఏడుపొచ్చింది అని అభి చెప్పాడు. నాగబాబు కాంప్లిమెంట్ తనకెంతో బలాన్నిచ్చిందని ఈ సందర్బంగా అభి అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X