ఇంట్రెస్టింగ్: ఆలీ సీట్ కొట్టేసిన నాగబాబు.. షాకవుతున్న జనం

Recommended Video

Naga Babu Re-Entry To Comedy Show || Filmibeat Telugu

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ అంటేనే అదో రకమైన క్రేజ్. ఫ్యామిలీ అంతా ఒకేచోట కూర్చొని మస్త్ జబర్దస్త్‌గా ఎంజాయ్ చేసే బుల్లితెర ట్రీట్ ఇది. యాంకర్ అనసూయ అందాల విందు, న్యాయనిర్ణేతల నవ్వులు, స్కిట్లు చేసేవారి వేషాలు అన్నీ ఈ షోలో దేనికవి ప్రత్యేకమే. ముఖ్యంగా తనదైన పంచ్ డైలాగులతో ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో నాగబాబు తీరే వేరు. ఆయన నవ్వు లోనే ఆడో రకమైన వైబ్ ఉంటుంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఈ వైబ్ మిస్ అయ్యారు బుల్లితెర ప్రేక్షకులు. ఆయన స్థానంలో ఆలీ వచ్చి జబర్దస్త్ నడిపించారు. అయితే తాజాగా ప్రసారమవుతున్న ప్రోమో వీడియోలో మరోసారి నాగబాబు దర్శనం అందరికీ షాకిచ్చింది.

ఎన్నికల సందర్భంగా నాగబాబు దూరం

ఎన్నికల సందర్భంగా నాగబాబు దూరం

తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఎన్నికల సమయంలో జబర్దస్త్ షో వదిలేశారు. దీంతో కొన్ని ఎపిసోడ్స్‌లో సీనియర్ హీరోయిన్ మీనా, శేఖర్ మాస్టర్ లతో షో నడిపించారు నిర్వాహకులు. వీరిద్దరితో ఆశించిన రెస్పాన్స్ రాకపోవడంతో ఆలీని ఎంటర్ చేశారు.

ఈ లోగా రోజా ఆగమనం.. కానీ నాగబాబు మాత్రం

ఈ లోగా రోజా ఆగమనం.. కానీ నాగబాబు మాత్రం

ఈ లోగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రోజా జబర్దస్త్ తెరపైకి వచ్చేసింది. కానీ నాగబాబు మాత్రం రీ ఎంట్రీ ఇవ్వలేదు. ఆయన స్థానంలో రోజా పక్కన ఆలీనే కనిపించాడు. దీంతో గెలిచిన రోజా ఎంటరైంది కానీ నాగబాబు రాలేదంటే ఇక నాగబాబు జబర్దస్త్ షో కి గుడ్ చెప్పేసినట్లే అని భావించారు బుల్లితెర ప్రేక్షకులు.

మీడియా ప్రచారంతో

మీడియా ప్రచారంతో

దీనికి తోడు నాగబాబు స్థానాన్ని ఆలీతో కవర్ చేశారు ఇక నాగబాబు రాడంటూ మీడియాలో వార్తలు రావడం, ఈ వార్తల పై నాగబాబు కూడా స్పందించ పోవడంతో జబర్దస్త్ షో లో ఇక అలీనే నవ్వుల మారాజు అని అందరూ ఫిక్సయ్యారు. అయితే ఊహించని రీతిలో తాజాగా ప్రసారమవుతున్న ప్రోమో వీడియోలో నాగబాబు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఆలీ రీ ప్లేస్ అయినట్లే.. మెగా అభిమానుల్లో జోష్

ఆలీ రీ ప్లేస్ అయినట్లే.. మెగా అభిమానుల్లో జోష్

అనూహ్యంగా నాగబాబు, రోజాలతో న్యాయనిర్ణేతలుగా ఉన్న జబర్దస్త్ ప్రోమోను ఈ టీవీ ప్రసారం చేయడంతో మెగా అభిమానులంతా జోష్‌లో మునిగిపోయారు. అలీ స్థానంలోకి నాగబాబు వచ్చేశాడని, ఇక ఆలీ రీ ప్లేస్ అయినట్లే అని జనంలో చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఈ షోలో రోజా కనిపిస్తున్నప్పటికీ ఆమె విషయంలోనూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి. చూడాలి మరి ఈ షో న్యాయనిర్ణేతల విషయంలో ఇంకెన్ని ట్విస్టులు ఉండనున్నాయో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X