Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెరవెనక నాగబాబు సీరియస్ ప్రయత్నాలు.. ఇక లాభంలేదని! మెగా బ్రదర్ స్కెచ్ అదిరింది
బుల్లితెర నవ్వుల రారాజు, మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే జబర్దస్త్ వీడి.. అదిరింది వేదికపైకి చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ 'అదిరింది' షో అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలమైందని టాక్. అనుకున్న రేంజ్ టీఆర్ఫీ రేటింగ్ రాకపోవడమే గాక, జబర్డస్త్‌కి ఏ మాత్రం పోటీ ఇవ్వట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు అండ్ టీం మరో అదిరిపోయే స్కెచ్ వేస్తున్నారు. వివరాల్లోకి పోతే..

టార్గెట్ అదే.. పోటీని మరింత పటిష్టం చేసేలా ప్లాన్
జబర్దస్త్ రేటింగ్స్‌ని బీట్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకొని అదిరింది జడ్జ్ అయ్యారు నాగబాబు. ఈ మేరకు జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ఆర్పీ, ధన్‌రాజ్, వేణులను కూడా రంగంలోకి దించారు. కానీ రేటింగ్స్ పరంగా ఆశించిన ఫలితం రావట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే వెనక్కితగ్గకుండా ఆ పోటీని మరింత పటిష్టం చేసేలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారట.

యూబ్యూబ్‌లో కామెంట్స్.. యాజమాన్యం మార్పులు
జబర్దస్త్ షోను ఢీకొట్టాలని రంగంలోకి దిగిన అదిరింది.. దానికి సరైన పోటీ ఇవ్వడం లేదు. ఇది గమనించిన 'అదిరింది' యాజమాన్యం షోలో కొన్ని మార్పులు చేస్తోందని తెలుస్తోంది. యూబ్యూబ్‌లో కామెంట్ల రూపంలో వస్తున్న ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ని పరిగణనలోకి తీసుకొని.. అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్.

తెరవెనక నాగబాబు ప్రయత్నాలు
మరోవైపు అదిరిందిని ట్రాక్ లోకి తెచ్చేందుకు తెరవెనక నాగబాబు సీరియస్‌గా ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త స్టార్లను రంగంలోకి దింపుతున్నారట. యూబ్యూబ్‌లో నెటిజన్స్ ఇచ్చిన సలహా మేరకు పటాస్ స్టార్స్‌ని కూడా 'అదిరింది' లోకి లాగేస్తున్నారట.

స్కెచ్ ఇదే.. కొత్త టీమ్ రెడీ
ఈ క్రమంలోనే గత వారం పటాస్ నుంచి సద్దాంను తీసుకొచ్చారు. అదేబాటలో ఈ వారం మరో పటాస్ స్టార్ యాదమ్మ రాజును రంగంలోకి దింపారు. ఈ మేరకు పటాస్ స్టార్స్ సద్దాం, యాదమ్మరాజు లతో ఓ కొత్త టీమ్ రెడీ చేసి సరికొత్త కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు అందించాలని నాగబాబు ప్లాన్ చేస్తున్నారట.

నాగబాబు కమిట్‌మెంట్ ఇస్తే.. ఇదే నిదర్శనం
ఆదివారం ప్రసారం కాబోయే అదిరింది ఎపిసోడ్ ప్రోమోలో సద్దాం, యాదమ్మరాజు కామెడీ పంచ్‌లు హైలైట్ అవుతున్నాయి. ఈ పంచెస్ చూసి నాగబాబు, నవదీప్ పడిపడి నవ్వుతూ కనిపించారు. సో ఈ ప్లాన్ వర్కవుట్ అయిందంటే ఇక పటాస్ వీరులందరినీ లాగే ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా
అదిరింది కోసం నాగబాబు చేస్తున్న ఈ సీరియస్ ప్రయత్నాలు ఆయన కమిట్‌మెంట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.