Tejaswi Prakash: బ్లాక్ కలర్ జారే చీరలో తేజస్వి నిఘనిఘలు..నిండు జాబిలమ్మలా ఎంత సక్కగుందో?
నాగిని సీరియల్ బ్యూటీ, బిగ్ బాస్ ముద్దుగుమ్మ తేజస్వి ప్రకాష్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ సీజన్ 15 విన్నర్ గా, నాగిని సీరియల్ యాక్టర్ గానే బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈమె.. సీరియల్స్, టెలివిజన్ షోస్ తో పాటు పలు వీడియోల్లో కూడా నటించి మెప్పించింది. ఇలా కెరియర్ లో దూసుకుపోతున్న ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగానూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలా తాజాగా ఈమె బ్లాక్ కలర్ జారే చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సీరియల్స్, టీవీ షోలతో పాటు.. రెండు మరాఠీ సినిమాల్లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అయితే నాగిని సీరియల్ కు తెలుగులో కూడా ఎక్కువగా ఫ్యాన్స్ ఉండడంతో.. ఆమె గురించి తెలుసుకునేందుకు తెలుగు ప్రేక్షుకులు ముందుంటారు. అందుకే ఈ హాట్ బ్యూటీని సోషల్ మీడియా వేధికలుగా ఫాలో అవుతూ.. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. ఆమె కూడా దేశ వ్యాప్తంగా ఉన్న తన అభిమానుల కోసం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటూ ఉంటుంది.

పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందచందాలు ఆరబోస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు ఆరబోసి రచ్చ చేసింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ జారే చీర కట్టుకుని అందంగా ముస్తాబైంది. అందులో డిజైనర్ స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకొని సోకులు ఆరబోసింది. బ్యౌగ్రౌండ్ అంతా బ్లాక్ గా ఉండేలా చేసుకుని.. తనమీద మాత్రమే ఫోకస్ పడేలా ఫొటోషూట్ చేయించుకుంది.
ఇందులో థ్రెడ్ బ్యాంగిల్స్ తో పాటు పెద్ద డైమంగ్ రింగ్, చెవులకు అలాంటివే కమ్మలు పెట్టుకుని అందంగా కనిపిస్తోంది. మెడలో ఏమీ వేసుకోకపోయినా.. చాలా ముద్దుగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అంతా పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. అందంగా అన్నావు, అదిరిపోయావు అంటూనే.. మొహమొహం మిలమిలా మెరిసిపోతుందంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. తేజిస్వీ ప్రకాశ్ ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 4 లక్షలకు పైగా లైకులు, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.
స్వరాణిగి సీరియల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. ఈ సీరియల్ ఫుల్లుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు సీరియళ్లలో నటించి మెప్పించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 15 విన్నర్ గా నిలిచి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కరుణ్ కుంద్రాతో బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడిన స్నేహం వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











