బిగ్‌బాస్‌లో తొండాట .. నైనికపై యష్మీ ప్రతీకారం.. నాకే సిగ్గులేదంటూ కంటెస్టెంట్ కామెంట్

బిగ్‌బాస్ తెలుగు 8 ఫస్ట్ వీకెండ్‌కు చేరుకుంది. తొలివారమే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించిన ఈ రియాలిటీ షోలో టాస్క్‌లు హీటెక్కిస్తున్నాయి. అన్ని సీజన్‌లలో మాదిరిగానే ఇప్పుడు కూడా టాస్క్‌ల్లో కొందరు కంటెస్టెంట్స్ తొండాటలు ఆడుతున్నారు. వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా యాష్మీగౌడ టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రతిసారి ఆమెను లక్ లక్కలాగా అంటిపెట్టుకుని కాపాడేస్తోంది. ఇప్పటికే చీఫ్‌గా ఉన్న యాష్మీకి ఇప్పుడు ఇంటిపెత్తనం కూడా వచ్చేసింది.

బిగ్‌బాస్ తెలుగు 8లో గుడ్డు గురించి, కర్రీ గురించి సిల్లీ రీజన్స్‌తో గొడవపడుతున్న కంటెస్టెంట్స్‌కు టాస్క్‌ల పుణ్యమా అని కాస్తంత వాలిడ్ రీజన్స్ దొరికేసరికి తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం చేస్తూ పరువు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పనిపాటా లేకుండా , ఏదో మూలన పడిఉన్న కంటెస్టెంట్స్‌ కూడా గొంతు చించుకుంటున్నారు. ముగ్గురు చీఫ్‌లలో పవర్‌ఫుల్ ఎవరో తేల్చుకోవాలంటూ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్ .. ఇంటి సభ్యులను మూడు జట్లుగా డివైడ్ చేశాడు.

nainika anasuru made sensational comments on yashmi gowda in Bigg Boss Telugu 8 here s the details

ఈ టాస్క్‌ల్లో కొందరు తొండాట ఆడుతూ దొరికిపోయారు. ముఖ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్ అని అందరు అనుకుంటున్న పృథ్వీరాజ్ శెట్టి ఈ అన్ ఫెయిర్ గేమ్‌ను స్టార్ట్ చేసి అందరికీ షాకిచ్చాడు. నైనిక - యాష్మీ టీమ్‌కి పెట్టిన బాల్ పట్టు గోల్ పట్టు టాస్క్‌లో యాష్మీ విన్నర్‌గా నిలిచింది. దీంతో లూప్ ది హోప్స్ అనే మరో టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా కిందఉన్న రింగ్స్‌ని కంటెస్టెంట్స్ తమ బాడీ మీదుగా తీసుకొచ్చి ఇటు వైపుకు వేయాలి. ఇందులో నైనిక అండ్ టీమ్ ఇరగదీసింది. అయితే నైనిక బ్యాచ్ ఆటతీరుపై యాష్మీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. నైనిక టీమ్ సరిగానే ఆడిందని సంచాలక్‌గా ఉన్న నిఖిల్ చెప్పాడు.

నైనిక, యాష్మీ టీమ్‌లు చెరొక టాస్క్‌లలో గెలిచి సమంగా మారడంతో విన్నర్ ఎవరో తేల్చే మూడో టాస్క్‌ను మొదలుపెట్టాడు బిగ్‌బాస్. అదే బ్రిక్ బ్యాలెన్సింగ్ . దీనిలో భాగంగా బజర్ మోగేలోగా రెండు టీమ్స్ స్టాండ్స్‌పై ఐదు ఇటుకలను నిలబెట్టాలి. అయితే టాస్క్‌లలో దూకుడుతో ఉన్న నైనిక టీమ్ ఇందులో గెలుస్తుందని గెస్ చేసిన యాష్మీ గ్యాంగ్‌లోని పృథ్వీ.. నైనిక స్టాండ్‌లోని ఇటుకలను కిందపడేశాడు. దీనిపై నైనిక సంచాలక్‌గా ఉన్న నిఖిల్‌ను అడగ్గా.. అది స్ట్రాటజీ అంటూ పట్టించుకోలేదు. దీంతో తాను అలాగే చేస్తా అన్నట్లుగా నైనిక కూడా ప్రత్యర్ధి టీమ్ స్టాండ్‌ను పడేసింది. దీనికి మాత్రం నిఖిల్ స్పందించగా.. రెండు జట్లు కొట్టుకున్నంత పని చేశాయి. అయితే అప్పటికే యాష్మీ టీమ్ రెండు ఇటుకలను దిగ్విజయంగా నిలబెట్టడంతో ఆ జట్టు గెలిచిందని సంచాలక్ నిఖిల్ ప్రకటించాడు.

రెండు టాస్క్‌లలో గెలిచిన యాష్మీ టీమ్‌ను విజేతగా ప్రకటించిన బిగ్‌బాస్ వారికి డ్రాగన్ ఫ్లై రూమ్‌ను ఇచ్చాడు. దీంతో ఎగిరి గంతేసిన యాష్మీ టీమ్.. ఆ రూమ్‌లోకి వెళ్లి అక్కడ ఉంచిన చాక్లెట్లను లొట్టలు వేసుకుంటూ తిన్నారు. టీమ్ సభ్యులెవరూ చాక్లెట్లను పంచుకోకూడదని యాష్మీ ఆర్డర్స్ ఇవ్వడంతో .. ఓడిపోయిన వాళ్ల ముందే వాళ్లు చాక్లెట్లు తింటూ రెచ్చగొట్టారు. అనంతరం నైనిక, యాష్మీ, నిఖిల్‌లను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్‌బాస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

యాష్మీ టీమ్ ఇంట్లో ఎలాంటి పనులు చేయనక్కర్లేదని చెప్పాడు. అంతేకాదు.. వారు ఇంటి సభ్యులకు పనులు అప్పగించేలా పెత్తనం కట్టబెట్టాడు. దీంతో యష్మీ.. కుకింగ్‌ను నిఖిల్ బ్యాచ్‌కిచ్చి మొత్తం ఇంటి పనులను నైనిక టీమ్‌కి ఇచ్చి టాస్క్‌లో ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకుంది. చివరిలో తన టీమ్ సభ్యులతో నైనిక మాట్లాడుతూ.. యష్మీని చీఫ్‌గా చేశాను కదా నాకు సిగ్గుండాలి అంటూ బాధపడుతుంది. దీనికి సంబంధించిన క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X