Bigg Boss Telugu 8 Voting : నబీల్‌కి షాక్.. లెక్కలు మార్చేసిన నిఖిల్, దారుణంగా ఆమె ఓటింగ్!

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 5వ వారం చివరికి చేరుకుని మరికొద్దిగంటల్లో ఆరో వారంలోకి అడుగుపెట్టనుంది. మిడ్‌వీక్‌లో ఆదిత్య ఓం అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ ఎలా జరుగుతుంది.. ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారనే దాని గురించి చూస్తే :

ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఆదిత్య ఓం మిడ్‌వీక్‌లో వెళ్లిపోయారనే బాధ కంటెస్టెంట్స్‌లో ఎవరికీ కనిపించ లేదు. ఆదిత్య ఎంతో బాగా చూసుకున్న మణికంఠ కూడా జాలిగానే ఉంటున్నాడు. ఇక శత్రువుల్లా ఉంటున్న యష్మీగౌడ- మణికంఠల మధ్య గొడవలు సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణికంఠకు నేనున్నా అని యష్మీ అనగా.. నీ నవ్వు చూసి నీకు పడిపోయానంటూ మణికంఠ డైలాగ్స్ కొట్టారు. కానీ అంతలోనే మణికంఠకు అతని భార్య పంపిన బిర్యానీని దక్కకుండా చేసింది యష్మీ.

nainika in danger zone in Bigg Boss Telugu 8 here s the details

ఇంతలో బిగ్‌బాస్ నేను చెప్పిందే జరుగుద్ధి.. జాతకం చెప్పాలి అనే టాస్క్‌ను మణికంఠకి ఇచ్చాడు. ఈ కాసేపు హౌస్‌లో ఫన్ జనరేట్ అయ్యింది. అక్కడ కూడా మరోసారి యష్మీకి పడింది. నేను హౌస్‌లో ఒంటరిగా ఉండిపోతానా.. ఎవరైనా హంక్ వస్తారా అని అని మణికంఠని యష్మీ అడుగుతుంది. నీ ముందు హంక్ అయినా బంక్ కావాల్సిందే అంటూ సెటైర్లు వేస్తాడు. నీకు క్లారిటీగా నేనేంటో అర్ధం అయ్యిందిగా.. జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది యష్మీ.

తర్వాత మణికంఠకి జాతకం చెప్పే ఛాన్స్ రావడంతో యష్మీ రెచ్చిపోయింది. ముందు ఏడవటం ఆపి, ఎప్పుడూ నవ్వుతూ ఉండూ, నీ నవ్వుకే పడిపోయా కానీ పెళ్లయిందని తెలిసి సైలెంట్ అయిపోయానని చెప్పేసరికి ఇంటి సభ్యులు కేకలు వేస్తుంటారు. యష్మీని కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించిన బిగ్‌బాస్.. నిఖిల్ వాళ్ల అమ్మ చేసిన వంట, మణికంఠ వైఫ్ పంపిన బిర్యానీని ముందు పెట్టి నచ్చినవాళ్లకి ఇవ్వమంటాడు. యష్మీ మరో మాట లేకుండా నిఖిల్‌కు పట్టుకెళ్లి ఇవ్వడంతో మణికంఠ జుట్టు పీక్కున్నాడు. నిఖిల్‌కు వాళ్ల అమ్మ రాసిన మెసేజ్‌ను స్క్రీన్‌పై చూపించాడు బిగ్‌బాస్. నీ లక్ష్యాన్ని మరిచిపోవద్దు.. నువ్వు కప్ అందుకోవడాన్ని చూడాలని వెయిట్ చేస్తున్నానని చెబుతుంది. దాంతో నిఖిల్ ఎమోషనల్ అవుతాడు.

nainika in danger zone in Bigg Boss Telugu 8 here s the details

ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగ్గా.. మరో కంటెస్టెంట్ ఈ ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే . 5వ వారం నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య ఓం, నైనికలు నామినేషన్స్‌లో ఉండగా .. ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో మిగిలిన ఐదుగురి ఓటింగ్ రిజల్ట్స్ చూద్దాం.

nainika in danger zone in Bigg Boss Telugu 8 here s the details

రెండు వారాలుగా టాప్‌లో ఉన్న నబీల్‌ను వెనక్కినెట్టి నిఖిల్ (28.7 శాతం) ఓటింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా.. నబీల్ 26.2 శాతం ఓటింగ్‌తో గట్టి పోటీ ఇస్తున్నాడు. మణికంఠ 19.6 శాతం ఓటింగ్‌తో థర్డ్ ప్లేస్‌లో నిలిచాడు. విష్ణుప్రియ 15.2 శాతం, నైనిక 8.36 శాతం ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి నైనిక ఎలిమినేట్ కానున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X