Naga Panchami 29th February: పంచమిపై హత్యాప్రయత్నం.. ఆ తర్వాతే మోక్ష బలి.. కరాళీ ఖతర్నాక్ ప్లాన్!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. పంచమి నాగ దేవతను దర్శించుకునేందుకు ఆమె కోసం ప్రార్థన చేస్తుంది. కానీ ఎంత సేపటి నుంచి నాగదేవత నామ స్మరణ చేసినా ఆమె మాత్రం ప్రత్యక్షం కాదు. కానీ ఫణీంద్ర మాత్రం అక్కడకు వస్తాడు. పాము రూపంలోంచి మనిషి రూపంలోకి మారి నువ్వు ఎంత ధ్యానం చేసినా నాగ దేవత నిన్ను కరుణించదు అని చెబుతాడు. పంచమి మాత్రం చాలా భయపడిపోతూ ఫణీంద్రను చూస్తుంటుంది.
పంచమిని లేపిన కంత్రీ, తంత్రీలు: ముఖ్యంగా కరాళీ పంచమి అడ్డు తొలగించుకునేందుకు అనేక ఎత్తులు వేస్తోంది. తాజాగా పంచమిని చంపాలని తన అన్న నంబూద్రీకి చెప్పగా.. ఆయన అదిరిపోయే ప్లాన్ వేశాడు. ముఖ్యంగా జ్వాల శరీరంలోకి నంబూద్రీ ఆత్మ వెళ్లగా... కంత్రీ, తంత్రీలు వెళ్లి పంచమి, మోక్షల గది తలుపులు కొడతారు. అలా నిద్రలోంచి మెలుకువ వచ్చిన పంచమి బయటకు వస్తుంది. మోక్షకు డిస్ట్రబ్ కావొద్దనే ఉద్దేశంతో తలుపు వేసి వస్తుంది. పైనుంచి కింద హాల్లోకి వచ్చి ఎవరు డోర్ కొట్టారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

పంచమి పీక పట్టుకున్న జ్వాల: ఈక్రమంలోనే వెనకాల జ్వాల ఉంటుంది. అది గుర్తించిన పంచమి.. ఏంటి జ్వాల అమ్మగారు ఇలా చూస్తున్నారు అనగానే... నంబూద్రీ ఆత్మ నిన్ను చంపేస్తున్నానని చెబుతాడు. అలా పీక పట్టుకుని ఆమెను చంపే ప్రయత్నం చేస్తాడు. పంచమి మాత్రం తనను తాను కాపాడుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని సమస్యలు రాబోతున్నాయని హెచ్చరిక: ముందుగా పంచమి, మోక్షలను చూపిస్తారు. తన వద్ద ఉన్న నెమలి పించం వల్లే తమ సమస్య తొలగిందని.. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అండ తనకు ఉందని అంటుంది. అలాగే ఆ ఫించాన్ని భర్త మోక్షకు ఇస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంచుకోండి మీకు ఏ సమస్యా కలగదని చెబుతుంది. స్వామి వారు అండ నీకుండగా ఈ సమస్యలు ఎందుకు అని మోక్ష ప్రశ్నించగా.. ముందు ముందు ఇంకా పెద్ద సమస్యలు రాబోతున్నాయని హెచ్చరికగానే ఇవన్నీ చూపిస్తున్నాడని వివరిస్తుంది. ఇక ఆ తర్వాత అందరూ భోజనం చేసేందుక వస్తారు.
పంచమికి మాత్రమే భోజనంలో విషం కనిపించేలా: ముందుగా చిత్ర, ఆమె భర్త రాగా.. మేఘన వంటి చేసి పెడుతుంది. పది నిమిషాల్లో వంట ఎలా చేశావు నాకు నమ్మకం లేదంటూ చెబుతుంది. ఆ తర్వాత అంతా వస్తారు. తాను మాత్రం తినను అని చిత్ర అలాగే ఉండగా.. అంతా కూర్చుంటారు. పంచమిని రమ్మంటూ మోక్ష బతిమాలుతాడు. ఇలా అందరికీ భోజనం వడ్డించగా.. మేఘన కంత్రీ, తంత్రీలను రప్పిస్తుంది. వెంటనే వాళ్లు భోజనం మొత్తాన్ని నల్లగా చేస్తారు. అది చూసిన పంచమి భయంతో విషం, విషం అంటూ రచ్చ చేస్తుంది. ఎవరూ తినొద్దని చెబుతూనే ఆ భోజనం మొత్తాన్ని కింద పారేస్తుంది.
కరాళీ ఖతర్నాక్ ప్లాన్.. పంచమిని చంపాకే మోక్ష బలి: అందరి ప్లేట్లు కింద పడేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఒకరొకరుగా అందరూ వెళ్లిపోతారు. చివరకు మేఘన తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని మరీ తన అన్న నంబూద్రీ ఆత్మను రప్పిస్తుంది. మోక్షను బలిచ్చే కంటే ముందు పంచమిని చంపాలని... ఒకవేళ పంచమిని చంపకుండా మోక్షను బలిస్తే.. ఆ తర్వాత పంచమి నాగలోకం వెళ్లిపోతుందని చెబుతుంది.
కానీ అక్కడకు వెళ్లాక ఇష్టరూప శక్తులు పొందిన ఆమె భర్తను బలిచ్చినందుకు తనను చంపేందుకు భూలోకం వచ్చి మరీ హత్య చేస్తుందని అంటుంది. అందుకే ఈరోజే పంచమిని చంపాలని.. ఆ బాధ్యత నీదేనంటూ అన్న నంబూద్రీకి చెబుతుంది. తన పేరు పైకి రాకుండా పంచమిని చంపాలని వివరించగా... నంబూద్రీ ఆత్మ జ్వాల శరీరంలోకి వెళ్లి పంచమిని చంపేందుకు ప్రయత్నం చేస్తాడు.


Click it and Unblock the Notifications











