బిగ్‌బాస్ అంతా ఓ డ్రామా.. రేటింగ్ కోసం పక్కదార్లు.. నన్ను అలా చేశారు.. నమిత ఆగ్రహం
Recommended Video

జాతీయ స్థాయిలో హిందీ భాషలో బిగ్‌బాస్ రియాల్టి షో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఎన్టీఆర్, తమిళంలో కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఈ రియాల్టీ షోకు దక్షిణాదిలో మంచి క్రేజ్ వచ్చింది. అయితే బిగ్‌బాస్ వ్యవహారమంతో ఓ డ్రామా అంటూ నమిత వ్యాఖ్యలు చేయడం ఆ షోలో నైతికత ఎంత అనే విషయం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

నమిత సంచలనం
దక్షిణాది చిత్ర పరిశ్రమలో హాట్ హీరోయిన్‌గా పేరొందిన నమిత తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొనడం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వివాదాల నడుమ నమిత ఆ షో నుంచి బయటకు రావడం మరింత క్రేజ్ పెంచింది.

వీరాతో నమిత పెళ్లి
అయితే బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన స్నేహితుడు వీరాను నమిత పెళ్లి చేసుకొన్నది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో నమిత మాట్లాడుతూ.. బిగ్‌బాస్ రియాలిటీ షో ఓ డ్రామా. ఆ కార్యక్రమానికి క్రేజ్ పెంచుతూ వివాదాలు ప్లాన్ చేస్తుంటారు.

వారికి నిజాయితీ లేదు
బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు, నిర్వాహకులకు నిజాయితీగా వ్యవహరించరు. వారికి అంత క్రెడిబిలిటి కూడా లేదు. నేను ఏ విషయాన్నైనా ముఖం మీదే చెప్పేయటం వల్ల నాకు సమస్యలు ఎదురయ్యాయి.

నా మాటలు ఎడిట్
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మనస్తత్వం నాది. అలాంటిది నేను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుడు రీతిలో నిర్వాహకులు ప్రచారం చేశారు. అలా నన్ను క్యారెక్టర్‌ను డామేజ్ చేయడానికి ప్రయత్నించారు అని నమిత వాపోయారు.

నాకే దిమ్మతిరిగింది
బిగ్‌బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఉన్న ఎపిసోడ్స్‌ను చూశాను. వాటిని చూస్తే నాకే దిమ్మతిరిగింది. వారి వ్యవహార తీరుపై పట్టరానంత కోపం వచ్చింది.

పోరాటం చేయాలని
బిగ్‌బాస్ కార్యక్రమంలో నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించిన నిర్వాహకులపై పోరాటం చేయాలనుకొన్నాను. దాని వల్ల ప్రయోజనం లేదని తెలుసుకొని ఆ వివాదాన్ని వదిలేశాను అని నమిత చెప్పింది.

వివాదాలకు దూరంగా తెలుగు షో
తమిళ బిగ్‌బాస్ షోను పక్కన పెడితే తెలుగు రియాలిటీ షో వివాదాలకు చాలా దూరంగా ఉంది. తమిళ రియాలిటీ షోలో పలువురు నానా హంగామా సృష్టించారు. ఓ సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను షో నుంచి బయటకు పంపించారు.

ఎన్టీఆర్‌కు రికార్డు స్థాయి
ఇక ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్ చానెళ్ల చరిత్రలో ఊహించని విధంగా రేటింగ్ నమోదైంది. రికార్డు స్థాయి రేటింగ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











