జపాన్ టీవీలో నమితకు...ఊహించని అనుభవం(ఫోటో ఫీచర్)
చెన్నయ్ : బొద్దుగుమ్మ నమితకు ఊహించని అనుభవం ఎదురైంది. ఓ జపనీస్ టీవీ ఛానల్ నమితకు ఇండియన్ బ్యూటీ అనే ట్యాగ్ లైన్ తగిలించింది. సౌత్‌లో అంతంత మాత్రంగా కెరీర్ కొనసాగిస్తున్న నమితను జపాన్‌కు చెందిన టీవీ ఛానల్ పొగడ్తలతో ముంచెత్తడం నిజంగా ఊహించని పరిణామమే. జపాన్ టీవీ ఛానల్ తనను ఇండియన్ బ్యూటీ అంటూ పొగడటం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఉబ్బి తబ్బిబ్బవుతోంది నమిత. తన కాన్ఫిడెన్స్ లెవన్స్ మరింత పెరిగాయని అంటోంది.

వివిధ దేశాల్లో ఇంట్రెస్టింగ్ అంశాలను బేస్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆయా దేశాల నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్, అక్కడి సంస్కృతి పరంగా వారు ఎలా పాపులర్ అయ్యారు అనే అంశాలను ఈ కార్యక్రమంలో చర్చించారు. సౌత్‌లో ముఖ్యంగా తమిళనాడులో నమిత లాంటి భారీ శరీరం గల అందగత్తెలు ఎలా పాపులర్ అయ్యరనే విషయాలు ఇందులో ప్రస్తావించారు.

ఇంటర్నెట్‍లో నమితకు సంబంధించిన కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలు కనిపించడంతో...వారు కార్తీక్ శ్రీనివాస్ తీసిన నమిత ఫోటోను సెలక్ట్ చేసుకున్నారు.

ఇక నమిత సినిమాల వివరాల్లోకి వెళితే...ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇలమాయ్ ఓంజల్' చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

ఇలయామ్ ఓంజల్ చిత్రంలో నమిత పోలీస్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం మూడు భాషల్లో విడుదలవుతోంది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నమిత ఈచిత్రంలో డూప్ లేకుండా ఫైటంగ్ సన్నివేశాల్లో నటించింది.
జపాన్‌కు చెందిన టోక్యో టీవీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందగత్తెల లిస్టు తయారు చేసింది. ఇందులోని ఇండియన్ బ్యూటీల లిస్టులో నమితను కూడా చేర్చారు. ప్రముఖ పోటో గ్రాఫర్ కార్తీక్ శ్రీనివాసన్ తీసిన నమిత ఫోటో ఈ షోలో ప్రదర్శితం అయింది. 'Yari-sugi ko-ji Urban Legends Special' పేరుతో ప్రసారం అయిన ఈ షో నవంబర్ 2న ప్రసారం అయింది.


Click it and Unblock the Notifications











