Naga Panchami: పంచమిపై పగ తీర్చుకునేందుకు నంబూద్రీ ప్లాన్ - గరుడను ఇంటికి పంపడంతో భయంలో పంచమి

Naga Panchami October 19th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. అద్భుతమైన ఆలోచనలతో సీరియల్ ను రక్తికట్టిస్తున్నారు. ఇటీవలే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం పూర్తి చేసి భర్త మోక్షను.. పంచమి బాగు చేసుకుంది. ఇక తాజాగా పంచమిపై పగ తీర్చుకునేందుకు నంబూద్రీ, కరాళీలు.. దుష్ట గరుడను మోక్ష ఇంటికి పంపించారు. అక్కడకు వెళ్లిన గరుడను చూసి పంచమి తెగ టెన్షన్ పడుతుంది. విషయం గుర్తించిన మోక్ష నువ్వెవరని ప్రశ్నించగా.. నేను ఈ ఇంటికి అతిథిని అని చెబుతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి అతడిని నంబూద్రీ పంపాడని.. అతడు మన అతిథి అని చెబుతారు.

ఈక్రమంలోనే మరుసటి రోజు ఉదయం పంచమి కల్లాపి జల్లి, ముగ్గు పెడుతుండగా.. గరుడ తన రెక్కల నీడను పంచమిపై పడేలా చేస్తాడు. అది చూసిన పంచమి తన శత్రువును గుర్తిస్తుంది. ఈక్రమంలోనే అతడు కిందకు దిగి వచ్చి... నేను నీకోసమే వచ్చానని అంటాడు. నీపై పగ తీర్చుకోనిదే వెళ్లనంటూ చెప్పుకొస్తాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Namubdri Send Garuda to Moksha House to Take Revenge on Panchami in october 19th episode number 178th in naga panchami telugu serial

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా పంచమిపై కుటుంబ సభ్యులు అరుస్తూ గొడవ పడడం చూపించారు. మోక్ష బాబుకు ఇంకా ప్రాణ గండం ఉందని పంచమి చెబుతున్నా వినిపించుకోకుండా.. ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మోక్ష వచ్చి మధ్యలో అడ్డుకుంటాడు. భార్యాభర్తలను విడదీయడం సరైన పద్ధతి కాదని.. తన భార్య చాలా మంచిదని చెబుతాడు. ఆమె తనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుందని గట్టిగా చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక ఆ తర్వాత నంబూద్రీ, కరాళీలను చూపిస్తారు.

పంచమిపై పగ తీర్చుకునేందుకు జాతి వైరాన్ని ఉపయోగించుకుంటానంటూ నంబూద్రీ.. కరాళీకి చెబుతాడు. ఇలా తన దుష్ట శక్తిని ఉపయోగించి మనిషి రూపంలో ఉండే గరుడ పక్షిని తీసుకొస్తాడు. అతడు తన ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా... తమ జాతికి శత్రువు అయిన పాముపై పగ తీర్చుకుంటానంటాడు. ముఖ్యంగా మీరు చెప్పిన వారిని ఏం చేయడానికి అయినా నేను సిద్ధమేనంటూ వివరిస్తాడు. ఇక ఆ తర్వాత మోక్ష తల్లి పంచమిని చూపిస్తారు. ఆమె తన కొడుకు తన మాట వినకుండా కావడానికి కారణం నువ్వేనంటూ పంచమిపై ఫైర్ అవుతుంది.

Namubdri Send Garuda to Moksha House to Take Revenge on Panchami in october 19th episode number 178th in naga panchami telugu serial

నా భర్త.. నా మంచితనం, నిజాయితీని గుర్తించడం వల్లే ఇలా జరుగుతోందని.. మీరు గుర్తించకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని పంచమి అంటుంది. డబ్బులు తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోమని అనగా.. సౌభాగ్యాన్ని అమ్ముకునేంత పిచ్చిదాన్ని కాదని చెబుతుంది. మీకు ఎవరైనా డబ్బులు ఇస్తే మీ భర్తను వదిలేస్తారా అంటూ ప్రశ్నిస్తుంది. అందుకు ఆమె నన్నే ప్రశ్నించే స్థాయికి వచ్చావా అంటూ మరింత కోప్పడుతుంది. ఆ తర్వాత అక్కడకు సుబ్బు వచ్చి తాను వెళ్లిపోతానని అంటాడు. కానీ పంచమి మాత్రం ఇంకా కొంత కాలం ఉండమని అంటుంది. ఎప్పుడు వెళ్లాలో చెప్పమని సుబ్బు అడిగినప్పటికీ.. తాను తర్వాత చెబుతానంటూ వివరిస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X