ఉదయభాను పిల్లలకు బాలయ్య ఫ్యామిలీ రేర్ గిఫ్ట్.. బ్రహ్మణి బహుమతి ఏమిటో తెలుసా?
యాంకర్ ఉదయభాను .. ఈమె గురించి తెలియని తెలుగు వారుండరు . యాంకర్‌గా హీరోయిన్‌లను మించిన స్టార్‌డమ్‌తో తెలుగు బుల్లితెరను ఏలారు ఉదయభాను. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి వంటి వారిని సైతం ఆమె డామినేట్ చేశారు. టీవీ షోలు, సినిమాలు, ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. అయితే ఏమైందో కానీ దాదాపు ఐదారేళ్ల పాటు ఆమె బుల్లితెరపై కనిపించలేదు. దీంతో ఉదయభాను అభిమానులు షాక్ అయ్యారు.
నవంబర్ 6, 1972న కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించారు ఉదయభాను. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే, ఈమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ఉదయభాను తొలుత సినీరంగం వైపే అడుగులు వేశారు. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యంలో ఆమె నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రావణ మాసంతో పాటు పలు కన్నడ , తమిళ చిత్రాల్లోనూ ఉదయభాను నటించారు.

తెలుగునాట బుల్లితెర అప్పుడప్పుడే వృద్ధి చెందుతున్న దశలో యాంకరింగ్ చేయాలనే ఆమె నిర్ణయం కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి ప్రోగ్రామ్‌తో పలకరించిన ఉదయభానుకు జెమినీ టీవీలో వచ్చిన వన్స్ మోర్ ప్లీజ్‌తో యూత్‌తో క్రేజ్ సంపాదించారు. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్‌తో కలిసి ఉదయభాను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. యాంకర్ అంటే ఉదయభాను.. ఉదయభాను అంటే యాంకర్ అన్నంతగా అప్పట్లో ముద్ర వేసుకుంది. ఈవిడ కనిపించని ఛానెల్ అంటూ ఏది ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.
యాంకరింగ్, సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె కొద్దినెలల క్రితం ఏపీలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ సభ ద్వారా అభిమానులు తిరిగి పలకరించారు. మిద్దె విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని పెళ్లాడిన ఉదయభానుకి ఇద్దరు కుమార్తెలు. భూమి ఆరాధ్య , యువి నక్షత్ర. ప్రస్తుతం భర్త , పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఉదయభాను. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి వంటలు, లైఫ్ స్టైల్ ఇతర వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ అగ్ర కథనాయకుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి తన పిల్లలకు గిఫ్ట్ పంపించారని ఆ వీడియోలో ఉదయభాను పంచుకుంది. అది వయోలిన్ కావడంతో పిల్లలిద్దరూ థ్యాంక్యూ బాలయ్య మామ అని చెప్పారు. అలాగే ఉదయభాను కూడా బాలకృష్ణ, నారా బ్రాహ్మణికి థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నందమూరి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఉదయభాను.. రవీంద్ర భారతిలో నాటకాలు వేయడం, స్వయంగా రచించడం వంటి పనులతో బిజీగా ఉన్నారు. మధ్య మధ్యలో కొన్ని ఈవెంట్స్‌కు ఆమె యాంకరింగ్ చేస్తూ జనాన్ని అలరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











