Unstoppable with NBK సరికొత్త రికార్డు.. టాక్ షోతో కుమ్మేసిన బాలయ్య.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
నట సింహం, బాక్సాఫీస్ బొనాంజ నందమూరి బాలకృష్ణ రికార్డుల పరంపరం కొనసాగుతూనే ఉంది. నాలుగు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో బాలకృష్ణ ఎన్నడూ లేని విధంగా సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నారు. ఇప్పటి వరకు నటుడిగా, రాజకీయవేత్తగా, వైద్యరంగంలో సామాజిక కార్యకర్తగా విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న బాలయ్య.. 2021లో సరికొత్త అవతారంలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. జీవితంలో తొలిసారి Unstoppable With NBK టాక్ షోను ప్రారంభించి రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. తాజాగా బాలయ్య క్రియేట్ చేసిన సరికొత్త రికార్డు ఏమిటంటే?

ఓటీటీలో అడుగు పెట్టడమే రికార్డుల పరంపర
నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైకి అడుగు పెట్టడమే కాకుండా రికార్డులతో దడదడలాడించేస్తున్నారు. తొలి ఎపిసోడ్ నుంచే అంచనాలు పెంచుకొంటూ ముందుకు సాగారు. అన్‌స్టాపబుల్ టాక్ షోను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తూ అశేషంగా ప్రేక్షకుల స్పందనను కూడగట్టుకొన్నారు. ఇప్పటి వరకు తొలి సీజన్‌లో 11 ఎపిసోడ్స్ బ్లాక్‌బస్టర్‌గా మారాయి.

మోహన్ బాబు నుంచి మహేష్ బాబు వరకు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ప్రారంభించిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఆరంభం అదిరిందనిపించింది. ఇక ప్రతీ ఎపిసోడ్ దేనికి అదే విభిన్నంగా మారింది. చివరి ఎపిసోడ్ మహేష్ బాబుతో చేసిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. మహేష్ బాబుతో చేసిన ఇంటర్వ్యూ సీజన్ 1లో చివరి ఇంటర్వ్యూ కావడం గమనార్హం.

దేశంలోనే టాప్ టాక్ షోగా
ఇక బాలకృష్ణ హోస్ట్‌గా ప్రారంభించిన అన్‌స్టాపబుల్ టాక్ షో దేశంలోనే నంబర్‌వన్ షోలో టాప్ 5లో ఒకటిగా నిలిచింది. జాతీయ ఛానెల్‌లో కపిల్ శర్మ నిర్వహించే ది కపిల్ శర్మ షోతో పోటీ పడింది. దేశవ్యాప్తంగా టాప్ ర్యాంకింగ్‌ను అన్‌స్టాపబుల్ సొంతం చేసుకొన్నది. ఎవరూ ఊహించని విధంగా మోస్ట్ పాపులర్ ఈ టాక్ షోగా ఘనతను సాధించింది.

ఆహాలో 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో
ఇదిలా ఉండగా, బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ మరో సరికొత్త మైలురాయిని చేరుకొన్నది. ఆహా ఓటీటీలో అత్యధిక సమయం వీక్షించిన షోగా రికార్డు క్రియేట్ చేసింది. ఆహాలో సుమారు 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసింది. ఆహాలో మోస్ట్ వాచ్‌డ్ షోగా ఘనతను సాధించింది. ఈ సందర్భంగా అన్‌స్టాపబుల్ లవ్ ఫర్ అన్ మ్యాచబుల్ ఎనర్జీ అంటూ ఓ ప్రకటనను ఆహా యూనిట్ విడుదల చేసింది.

బాక్సాఫీస్ వద్ద అఖండ రికార్డులు
ఇక టాక్ షో రికార్డులను పక్కన పెడితే.. బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం థియేట్రికల్‌గాను, అలాగే ఓటీటీ పరంగాను రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో మొత్తంగా 63.28 కోట్లు షేర్, 105.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 75.10 కోట్లు షేర్, 133 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Recommended Video

ఓటీటీలో అఖండ టాప్ రేటింగ్
అలాగే థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే అఖండ చిత్రం డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజైంది. అయితే దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరోల సినిమాలను తలదన్నేలా అఖండ సినిమాకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ లభించింది. దేశవ్యాప్తంగా ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాగా అఖండ రికార్డును సొంతం చేసుకొన్నది. దేశంలోనే ఈ హీరో సాధించని ఫీట్‌ను బాలయ్య నమోదు చేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆనందం నెలకొన్నది.


Click it and Unblock the Notifications











