Balakrishna: శ్రీలీలతో బాలయ్య అలా... జీ ఫ్లోర్ బలిసిందా డాడీ అంటూ మోక్షజ్ఞ మాస్ వార్నింగ్

నందమూరి నటసింహం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన విడుదల కానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రబృందం.. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంటును హనుమకొండలో జరుపుకుంది. ఇక ఈ ఈవెంటులో బాలయ్య ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా మోక్షజ్ఞ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చదవండి.

భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య గర్జించడానికి థియేటర్లోకి రాబోతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటు ఘనంగా హనుమకొండలో జరిగింది. కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురిగా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు. ఇక ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

Nandamuri Balakrishna Speech on Mokshagna Sreeleela at Bhagavanth Kesari Movie Trailer Launch Event

ఇక ఈ వేడుకలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ... అందరికీ నమస్కారం.. ఇక్కడ వరంగల్ పట్టణ వాసులకు, నా అభిమానులందరికీ నమస్కారాలు. ఇవాళ పుష్యమి నక్షత్రం ఉంది. ఇవాళ గంట సేపు పూజ చేస్తాను. ఇవాళ మధ్యాహ్నం 12.50కి లేచాను. నా ఎక్ససైజ్ పూర్తి చేసుకుని బయలుదేర షూటింగ్కు. ఇవాళ నా నక్షత్రం ప్రకారం దుర్గామాతను పూజించాలి. ఇక ఇక్కడ చూస్తే.. అమ్మవారి ప్రాంతమిది. నేను పొద్దున్నే శ్లోకాలు అన్ని చదువుకుంటాను అంటూ చెప్పుకువచ్చారు.

బాలయ్య మాట్లాడుతూ... ముందుగా దసరా శరాన్నవరాత్రులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి.. ఆ అమ్మని తలుచుకోవడం.. ఆ అమ్మవారే పిలిపించుకున్నట్లు.. ఈ పుణ్య ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం.. సంతోషం. ఎంతో మంది యోధులు పుట్టిన గడ్డ ఇది. ఇక సినిమా గురించి మాట్లాడితే నేను మొట్ట మొదటి సారి తెలంగాణ మండలికంలో మాట్లాడటం... ఒక అఖండ తర్వాత ఏం చేస్తాడు అనుకున్న తరుణంలో వీరసింహ రెడ్డి సినిమా.. చేశాం. అది రికార్డులు సృష్టించిందని వెల్లడించారు.

Nandamuri Balakrishna Speech on Mokshagna Sreeleela at Bhagavanth Kesari Movie Trailer Launch Event

ఆ తర్వాత ఏంటి అనుకున్న సమయంలో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి కథతో రావడం.. ఇక ఈ సినిమాలో పంచభక్ష పరమన్నం ఉండాలి. అవన్నీ ఉంటేనే బాలయ్య సినిమా అవుతుంది. ఇక అనిల్ రావిపూడి నా అభిమాని. తెలంగాణ సీమ సింహాన్ని... సీమ సింహన్నీ.. బొబ్బిలి పులి సిమ సింహాన్ని.. రాయల సీమ సింహన్నీ.. టోటల్ గా తెలుగు సీమ సింహాన్ని.. నా తండ్రి తారకారామారావును తలుచుకుంటూ.. చావులేని జీవితాన్ని ఎన్టీఆర్ పొందారు. మహాత్తర జన్మను పొందారు. ఆయనకు చావు ఎక్కడిది. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ఇక చాలా ఉంది చెప్పాలంటే.. చాలా దాచి పెట్టామన్నారు.

ఇక అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్‌తోనే హిట్టు కొట్టాడు. అది నా రౌడీ ఇన్‌ స్పెక్టర్ సినిమాలోని నాకు చెప్పకుండా కాపీ కొట్టి వాడేశాడు... ఇక ఈ సినిమా విషయానికి వస్తే... కామెడీగా తీయాలా... సీరియస్‌గా తీయాలా.. అని అనుకుంటూ ఉండేవాడు.. నేను కూడా కామెడీ కింగ్‌ నే.. కామెడీ సినిమా కూడా తీద్దామని అన్నాను. ఇక సినిమాలో వేసిన పాత్రల నుంచి నటీనటులు బయటకు రావడం లేదు.. అంతగా లీనం అయి నటించారు.. నవ్వుతూ కనిపించే వారికంటే నాలా కోప్పడేవారే మంచివాళ్లు.. ఎందుకంటే కడుపులో ఏం దాచుకోకుండా కక్కేస్తారు అంటూ చెప్పుకువచ్చారు.

ఇక ఈ సినిమాలో శ్రీలీల ప్రతీ సారి నన్ను చిచ్చా అని పిలుస్తూ ఉండేది. ఇక శ్రీలీలతో నెక్ట్స్ హీరోయిన్‌ గా చేద్దామని అనుకున్నా.. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని మోక్షజ్ఞ నన్నే అన్నాడు.. ఇంట్లో నేను కుర్ర హీరోని రావడానికి రెడీగా ఉన్నా.. నువ్ ఆమెతో చేస్తాను అంటావా? అని నాకే వాడు వార్నింగ్ ఇచ్చాడు అంటూ అసలు విషయం చెప్పుకువచ్చాడు.

ఇక తమన్ గురించి చెప్పేది ఏముంది... నా సినిమా అంటే పూనకం.. ఆయన కొడితే థియేటర్లో బాక్సులు పగిలిపోతాయ్.. కొన్ని సార్లు థియేటర్లో సౌండ్ పెంచేందుకు పర్మిషన్ ఇవ్వరు.. కానీ నా ఫ్యాన్స్ మాత్రం ఊరుకుంటారా థియేటర్లు తగలపెట్టేస్తారు.. అఖండకు ప్రభుత్వాలు సహకరించలేదు.. కరోనా సమయంలో రేట్లు పెంచలేదు..కానీ జనాలు థియేటర్లకు వచ్చారు.. ఆ సినిమా సంచలనాలు సృష్టించింది అంటూ చెప్పుకు వచ్చారు. ఇక లాస్ట్ కు జై తెలంగాణ జై ఆంధ్రా అంటూ స్పీచ్ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X