twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable with NBK 2: మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. మొదలయ్యేది ఎప్పుడంటే?

    |

    నందమూరి బాలకృష్ణ బిగ్గెస్ట్ రియాలిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఎన్నో భారీ విజయాలను అందుకున్న నందమూరి బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆహా ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టి మొదటి దశలోనే మంచి గుర్తింపు అందుకున్నారు. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ ఆహా సంస్థ స్థాయిని కూడా మరో లెవెల్ కి పెంచింది అనే చెప్పాలి. మొత్తానికి నందమూరి బాలకృష్ణ మరోసారి సీజన్ 2 తో కూడా ఆకట్టుకుకోబోతున్నట్లుగా టాక్ వస్తోంది. ప్రస్తుతం నిర్వాహకులు రెండవ సీజన్ కోసం ప్రణాళికలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...

    మొదట్లోనే సక్సెస్

    మొదట్లోనే సక్సెస్

    నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం సర్వసాధారణం అనే చెప్పాలి. జయాపజయాలను పక్కన పెడితే నందమూరి బాలకృష్ణ చాలా పాజిటివ్ గా ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ఆయన కెరీర్ మొదటి నుంచి కూడా ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. బుల్లితెరపై పెద్దగా ఫోకస్ చేసింది లేదు. ఇక మొదటి సారి ఆహా నిర్వాహకులు పక్కా ప్రణాళికతో రూపొందించిన అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా హోస్ట్ గా కనిపించారు.

    కాంట్రవర్సీ ప్రశ్నలతో..

    కాంట్రవర్సీ ప్రశ్నలతో..

    మొత్తానికి షో అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకవిధంగా నందమూరి బాలకృష్ణ తన అభిమానుల సంఖ్యను కూడా ఈ షో ద్వారా పెంచుకున్నాడు అనే చెప్పాలి. అంతేకాకుండా మొదటి సీజన్లో మొదటి ఎపిసోడ్ మంచు మోహన్ బాబు అలాగే ఆయన తనయుడు కూతురు కూడా ఈ టాక్ షో లో పాల్గొని మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం సాధారణ ప్రశ్నలు మాత్రమే కాకుండా అనేక రకాల కాంట్రవర్సీ ప్రశ్నలను కూడా నందమూరి బాలకృష్ణ చాలా సునాయాసంగా అడుగుతూ షోకు మంచి బజ్ క్రియేట్ చేశారు.

    క్లారిటీగా అర్థమైంది

    క్లారిటీగా అర్థమైంది

    ఆ తర్వాత ఇతర టెక్నీషియన్స్ దర్శకులను కూడా బాలకృష్ణ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఒక విధంగా బాలకృష్ణ మిగతావారితో ఎలా ఉంటాడో కూడా ఈ షో ద్వారా చాలా క్లారిటీగా అర్థమైంది. రవితేజతో గొడవలు ఉన్నాయని కూడా అనేక రకాల కథనాలు రాగా ఈ షో ద్వారా ఆయన వాటిని క్లియర్ చేసేశారు. బాలకృష్ణ దర్శకుడు రాజమౌళి, ఎమ్ఏమ్ కీరవాణిని కూడా చాలా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి వారి గురించి మరిన్ని సీక్రెట్ లను ఓపెన్ చేయించారు.

     మహేష్ తో స్పెషల్ గా..

    మహేష్ తో స్పెషల్ గా..

    ఇక చివరగా బాలయ్య విజయ్ దేవరకొండ, మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ లకు భారీ స్పందన లభించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు కూడా చాలా ఓపెన్ గా అనేక రకాల సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఇక ఆయనతో పాటు వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. మహేష్ చేస్తున్న చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ గురించి కూడా బాలయ్య మరింత మందికి తెలిసేలా చేశాడు.

    Recommended Video

    Nandamuri Balakrishna With His Family At Pushpa Movie Special Screening | Filmibeat Telugu
    రెండవ సీజన్..

    రెండవ సీజన్..

    ఇక త్వరలోనే బాలయ్య మరొక సీజన్ తో ఆకట్టుకునే విధంగా అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. అన్‌స్టాపబుల్ సీజన్ 2 కోసం ఆ ప్రోగ్రాం రైటర్ BVS రవి ఇప్పటికే ఒక ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. జూలై నెలలోనే అన్‌స్టాపబుల్ రెండవ సీజన్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదట ఒక ముగ్గురు సెలబ్రెటీలను ఫైనల్ చేసిన అనంతరం షోను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.

    English summary
    Nandamuri balakrishna Unstoppable season two interesting update ,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X