బింబిసార ఈవెంట్‌లో తీవ్ర విషాదం.. అనుమానాస్పద స్థితిలో అభిమాని మృతి!
ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ అభిమాని ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. అది కూడా తాజాగా ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ అపశృతి చోటు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తెలుగు మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని మేరకు సాయిరాం అనే ఎన్టీఆర్ అభిమాని మృతి చెందినట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ప్రేక్షకులందరూ
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ఎన్టీఆర్ కూడా పాల్గొని సినిమా బాగుందని ఖచ్చితంగా నందమూరి అభిమానులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులందరూ చూసి సినిమాను ఆదరించాలని కోరారు.

అనుమానాస్పద స్థితిలో
అంతేగాక ఎప్పటిలాగే ఇంటికి వెళుతున్న అభిమానులు అందరూ క్షేమంగా వెళ్లాలని మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి మరీ పంపించారు. అయితే సాయిరాం అనే ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక అభిమాని మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంకి చెందిన సాయిరాం పుట్టా అనే వ్యక్తి తెలంగాణలోని కూకట్పల్లి ప్రాంతంలో నివసిస్తూ ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు.

ఘటన మీద విచారణ
నందమూరి కుటుంబానికి ముఖ్యంగా ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన సాయిరాం ఎన్టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారనే విషయం తెలుసుకుని ఎలా అయినా ఆయనని చూడాలని ఉద్దేశంతో పాసులు తీసుకుని ఈవెంట్ కు హాజరైనట్లు సమాచారం. అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతానికి పోలీసులు ఈ ఘటన మీద విచారణ జరుపుకున్నారు.

అసలు కారణాలు ఏమిటి
అసలు సాయిరాం ఎలా మరణించారు ఆయన మరణానికి అసలు కారణాలు ఏమిటి అనే విషయం మీద వాళ్ళందరూ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా వరీనా హుస్సేన్, సంయుక్త మీనన్, కేథరిన్ తెరిసా హీరోయిన్లుగా బింబిసార అనే సినిమా రూపొందింది. మల్లిడి వశిష్ట్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అందరూ విషాదంలో
ఈ సినిమాను స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇక ఫేమస్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమాని ఒకరు మృతి చెందారు అనే విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు అందరూ విషాదంలో కూరుకుపోయారు.


Click it and Unblock the Notifications











