బిగ్‌బాస్‌లోకి నందమూరి హీరో..? హౌస్‌లో ఆయన దిగితే మామూలుగా ఉండదు మరి..
మరికొద్దిరోజుల్లో బిగ్‌బాస్ 8 తెలుగు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్ అవ్వగా.. షో ఎలా ఉండబోతుందన్న దానిపై నాగార్జున ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. ఏం కావాలన్నా లిమిట్ లెస్‌గా ఇస్తాననని.. కానీ అడిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నాగ్ కండీషన్ పెడతారు. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఏమేం వివాదాలు జరుగుతాయో.. వాటిని ఎలా వాడుకోవాలా అని పుకారు రాయుళ్లు రెడీగా ఉన్నారు.
బిగ్‌బాస్ నుంచి ఆడియన్స్ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందుకు తగినట్లుగా కంటెంట్ లేకుండా అసలుకే మోసం వస్తుంది. గతంలో కొన్ని సీజన్ల విషయంలో ఇలాంటి కొన్ని తప్పులు జరిగి షో బోర్ కొట్టింది. అయితే గతేడాది ఉల్టాపల్టా అంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని బిగ్‌బాస్‌ను తీసుకొచ్చారు. సామాన్యులు, సెలబ్రెటీలతో నిండిన ఆ సీజన్ ప్రేక్షకులకు మంచి మజాను అందించింది. షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాంట్రవర్షీలతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, టైటిల్ విన్నర్‌నే అరెస్ట్ చేసే పరిస్ధితి నెలకొంది.

ఈసారి అలాంటి తప్పులు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. కంటెస్టెంట్స్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయ్యిందని, త్వరలోనే వీరిని క్వారంటైన్‌కు పంపి మెడికల్ టెస్టులు చేయనున్నారు. ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే వారి ప్లేస్‌లో మరొకరిని తీసుకునేందుకు రిజర్వ్ బెంచ్‌ను సైతం సిద్ధం చేశారు. బిగ్‌బాస్ సెట్ కూడా ఈసారి విశాలంగా , మరింత కలర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ రివ్యూలలో హోరెత్తిస్తున్నారు.
ఇదిలాఉండగా .. బిగ్‌బాస్ 8 తెలుగుకు సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరా అన్న దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వస్తున్నా.. బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం కంటెస్టెంట్ల లిస్ట్‌ను సీక్రెట్‌గా ఉంచుతున్నారు. రీతూ చౌదరి, విష్ణుప్రియ, యాష్మిగూడ, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, సీనియర్ నటి సన, యాదమ్మరాజు, సింగర్ సాకేత్, అబ్బాస్, జబర్దస్త్ పవిత్ర, నిఖిల్ గౌడ, అంజలి పవన్, యాంకర్ సౌమ్యారావుల పేర్లను ఎక్కువ మంది యూట్యూబర్లు ప్రస్తావిస్తున్నారు.
తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో పేరొచ్చి చేరింది. అది కూడా ఏకంగా తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో కావడం విశేషం. ఆయన ఎవరో కాదు నందమూరి చైతన్యకృష్ణ. దివంగత నందమూరి తారక రామారావు కుమారుల్లో ఒకరైన జయకృష్ణ కొడుకే చైతన్యకృష్ణ. అప్పుడెప్పుడో 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్‌లో కీలకపాత్ర పోషించిన ఆయన.. లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల బ్రీత్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
అయితే చైతన్యకృష్ణ నటనకు మాత్రం విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతో చైతన్య కృష్ణ బిగ్‌బాస్‌ను ఎంచుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. చైతన్య గనుక బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడితే మామూలుగా ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











