బిగ్ బాస్ 2: బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయి నందినీ, భానుశ్రీ

By Bojja Kumar

బిగ్ బాస్ తెలుగు 2లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం నందినీ రాయ్, భానుశ్రీల మధ్య చిన్నగా మొదలైన గొడవ ఒకరికొకరు మాట మాట అనుకోవడంతో మరింత పెద్దగా మారింది. దీంతో ఇద్దరూ బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయారు. ఇంటి సభ్యులు వారిని వారించడానికి ప్రయత్నించినా వినిపించుకోకుండా రెచ్చిపోయారు. దీంతో ఇంట్లో సీరియస్ వాతావరణం నెలకొంది.

గొడవకు కారణం ఏమిటి?

గొడవకు కారణం ఏమిటి?

గొడవకు కారణం నందినీ పెట్టిన టీ.... భానుశ్రీ తీసుకోకపోవడమే. నందినీ తనను నామినేట్ చేసిందనే కోపంతోనే భానుశ్రీ అలా చేసిందని ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వాదన పెద్ద గొడవకు దారితీసింది.

నందినీ ఆ మాట అనడంతో రెచ్చిపోయిన భానుశ్రీ

నందినీ ఆ మాట అనడంతో రెచ్చిపోయిన భానుశ్రీ

భానుశ్రీ తాను పెట్టిన టీ తీసుకోకుండా కాఫీ తీసుకోవడంతో... కళ్లు కనిపించం లేదా? అంటూ నందినీ అనడంతో భానుశ్రీ ఇగో హర్ట్ అయింది. ఎందుకలా అన్నావ్ అంటూ భాను వేలు చూపిస్తూ నందినిపై విరుచుకుపడటం, వేలు చూపిస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదంటూ నందిని కౌంటర్ ఇవ్వడంతో గొడవ మరింత ముదిరింది.

బూతులతో రెచ్చిపోయిన వైనం

బూతులతో రెచ్చిపోయిన వైనం

ఈ క్రమంలో ఇద్దరూ బూతులు మాట్లాడుకుంటూ రెచ్చిపోయారు. **మూసుకుని కూర్చో, పళ్లు రాళతాయ్, ఫాల్‌‌తూ, గలీజ్ మాటలు అంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. దీంతో మధ్యలో కల్పించుకున్న ఇతర లేడీస్ భానుశ్రీని అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లారు.

మున్ముందు ఎలాంటివి చూడాలో?

మున్ముందు ఎలాంటివి చూడాలో?

అయితే ఇంటి సభ్యులు గొడవ పడే క్రమంలో ఇలాంటి మాటలు వాడటంపై ప్రేక్షకుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బిగ్ బాస్ షోలో మున్ముందు ఇంకా ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందో అని చర్చించుకుంటున్నారు.

 నామినేషన్లు

నామినేషన్లు

ఎలిమినేషన్ నామినేషన్ల విషయానికొస్తే.... తొలివారం సంజన అన్నె, రెండో వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసింతే. తాజాగా మూడోవారం ఎలిమినేషన్‌కు నామినేషన్లు పూర్తయ్యాయి. ఈ వారం గీతా మాధురి, గణేష్, తేజస్వి మదివాడ, భానుశ్రీ , కిరిటీ నామినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు వచ్చే ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X