బిగ్ బాస్2: కౌశల్ కోసం నందిని రాయ్ ఊహించని విధంగా.. ఏం చేసిందంటే!

బిగ్ బాస్ లో సమరం తారా స్థాయికి చేరుతోంది. సామ్రాట్ అదృష్టం కొద్దీ ఫైనల్స్ కు చేరిపోయాడు. ఇక ఇంటిలో ఉన్న మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఫైనల్స్ చేరుకుంటారు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వీకెండ్ వచ్చేయడంతో ఇంటిలోనుంచి బయటకు వెళ్ళేది ఎవరో రేపే తేలిపోనుంది. రేపటి నాని ప్రకటనతో ఫైనల్స్ సమరం హౌస్ లో మొదలైపోయినట్లే. ఇదిలా ఉండగా ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నందిని రాయ్ తాజాగా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

వాడీ వేడిగా హౌస్

వాడీ వేడిగా హౌస్

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ వాడి వేడిగా మారిపోయింది. అంతా ఇకవైపు కౌశల్ మాత్రం ఒకవైపు అన్నట్లుగా బిగ్ బాస్ సమరం సాగుతోంది. విజేత ఎవరనే విషయంలో ఆడియన్స్ కూడా ఓ క్లారిటీకి రాలేకున్నారు. కౌశల్ హాట్ ఫెవరెట్ అని భావిస్తున్నా ఈ వారం జరిగిన గొడవంతా అతడి గురించే. ఇక తనీష్, గీత మాధురి గట్టి పోటీ ఇస్తున్నారు.

ఎప్పుడూ గొడవ పడేవారు

ఎప్పుడూ గొడవ పడేవారు


ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యురాలు నందిని రాయ్ తాజగా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కౌశల్ కు మద్దత్తు తెలుపుతూ అతడికి ఓట్ వేసింది. హౌస్ లో ఉన్న సమయంలో వీరి మధ్య ఎప్పుడూ గొడవ జరిగేది. కానీ బయటకు వచ్చాక మాత్రం నందిని కౌశల్ కు మద్దత్తు తెలుపుతూ 50 ఓట్లు వేసింది.

 సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో


తాను కౌశల్ కు ఓట్ చేసిన విషయాన్ని నందిని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీనితో కౌశల్ మద్దత్తు దారులంతా నందిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కౌశల్ ఆర్మీ అయితే నందినికి కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఓట్ చేసిన ఫోటోని ఒక రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు.

 ఊహించడం కష్టమే

ఊహించడం కష్టమే


ఇప్పటివరకు ప్రతివారం జరిగిన ఎలిమినేషన్ విషయంలో ఆడియన్స్ అంచనాలు చాల వరకు నిజమయ్యాయి. కానీ ఫైనల్ ఎలిమినేషన్ మాత్రం ఊహించడం కష్టంగా మారింది. దీప్తి, కౌశల్, గీత, తనీష్, రోల్ రైడలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొని ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X