‘సమంత వెయిట్ చేయించదు.. ఆ నటి వల్ల నెల రోజులు ఈగలు తోలుకున్నాం’

చాలా రోజుల తర్వాత సమంత తెలుగులో నటించిన మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న వరల్డ్ వైడ్‌గా రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. తొలి రోజున ఏకంగా 13 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ వసూలు చేసి సమంత స్టార్ పవర్ ఏంటో చూపించింది మా ఇంటి బంగారం మూవీ. సినిమాను మరింత ప్రమోట్ చేయాలని భావిస్తోన్న చిత్ర యూనిట్.. ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో మా ఇంటి బంగారం టీమ్ సందడి చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని తొలిరోజు నుంచి సమంత అండ్ టీమ్ ఎంతో కష్టపడింది. సమంత ఒక్కరోజులోనే ఏకంగా 40కి పైగా ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా పట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు.

Nandini Reddy Reveals Fun Moments With Sreemukhi during Maa Inti Bangaram shooting

తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి మా ఇంటి బంగారం యూనిట్ హాజరైంది. సమంతతో పాటు దర్శకురాలు నందినీ రెడ్డి, శ్రీలక్ష్మీ, గౌతమి, రచిత తదితరులు పాల్గొన్నారు. గత రెండ్రోజులగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు వరుసగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సమంత- శ్రీముఖిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.

మా ఇంటి బంగారం అవ్వాలంటే ఎలా ఉండాలని ప్రదీప్ అడగ్గా.. కథ రాసింది వాళ్లాయనే అని మీకు తెలుసు కదా అది చెబితే మళ్లీ ఇంటికెళ్లాక అని శ్రీముఖి నవ్వేస్తుంది. మిమ్మల్ని ఆఫ్ స్క్రీన్ ఎవరు టార్చర్ పెట్టారని నందినీ రెడ్డిని ప్రదీప్ అడుగుతాడు. నా లైఫ్‌లో నేను ప్రొడ్యూసర్ మీద కంప్లైంట్ చేయను, అయితే సమంత డేట్స్ కోసం మేం వెయిట్ చేయలేదు, కానీ శ్రీముఖి కోసం నెల రోజులు అందరం ఇంట్లో కూర్చొని ఈగలు తోలుకున్నామని యాక్షన్ చేసి చూపించారు నందినీ. దాంతో శ్రీముఖి తన చీరతో ముఖాన్ని కవర్ చేసుకుని నవ్వేసింది.

మీ ఇద్దరిలో ఎక్కువ ఫోన్ వాడేది ఎవరు అని ప్రదీప్ ప్రశ్నించగా.. నేనే అని సమంత ఆన్సర్ ఇచ్చారు. మీ దగ్గర ఉన్న ఒక సిల్లీ టాలెంట్ ఏంటని అడగ్గా.. నా టాలెంట్స్ అన్నింటికీ చెక్ రావాల్సిందేనని సమంత కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫోటోలను శ్రీముఖికి చూపించి వాటితో కొన్ని సైగల ద్వారా అదేంటో కనుక్కోమని సమంతకి టాస్క్ ఇస్తాడు ప్రదీప్. కబడ్డీ అనేది చెప్పలేకపోవడంతో అవినాష్ వచ్చి కబడ్డీ అని క్లూ ఇచ్చి నవ్విస్తాడు

అనంతరం సమంత ఫోటోలను ఒక బోర్డ్‌పై ఉంచి ఒక్కో దాని గురించి అడిగింది శ్రీముఖి. నా గురించి నందినీ రెడ్డికి అన్ని తెలుసు.. కానీ సైలెంట్‌గా ఉంటుందని సమంత అన్నారు. అలాగే సమంత గారి సక్సెస్ వెనుక రాజ్ సార్ ఉన్నారని శ్రీముఖి చెప్పడంతో అంతా గోల గోల చేసేశారు. చివరిలో చిన్నారులను పిలిపించి నీకు చిన్న కోడలంటే ఇష్టమా? పెద్ద కోడలంటే ఇష్టమా అని అడగ్గా.. నాకు పెద్ద కోడలు ఇష్టమని పాప చెప్పడంతో చిన్నారిని సామ్ ముద్దుచేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. సమంత అండ్ మా ఇంటి బంగారం టీమ్ చేసిన సందడి గురించి తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X