తనీష్.. దానిని మలిచి పెట్టుకో.. నందిత ఝలక్!.. 1000 కోట్ల బడ్జెట్‌తో సినిమా!
బిగ్‌బాస్ హౌస్‌లో 38 రోజు ఎప్పటిలానే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో రియాలిటీ షో ప్రారంభమైంది. కాకపోతే గతంతో పోల్చుకొంటే కొంత ఆనందంగా కొనసాగింది. బిగ్‌బాస్ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా టాస్క్ ఆసక్తికరంగా, వినోదంగా సాగింది. రోల్‌రైడా, అమిత్, దీప్తి నల్లమోతు నిర్మాణంలో బ్లాక్‌బాస్టర్ సినిమాకు తెరలేపారు.
Recommended Video


గందరగోళంలో గణేష్
దీప్తి నల్లమోతును నామినేట్ చేసినందుకు గణేష్ గందరగోళంలో పడిపోయాడు. తాను చేసి తప్పా.. ఒప్పా అనే విషయంపై బాబు గోగినేనితో గణేష్ చర్చించాడు. సంకెళ్ల టాస్క్‌లో ఇద్దరు తమ అవగాహన మేరకు ఓ అంగీకారానికి రావాల్సి ఉండేది. అందుకే అది జరుగలేదు. కాబట్టే మీ ఇద్దరి మధ్య గందరగోళం నెలకొన్నది అని గణేష్‌తో బాబు గోగినేని స్పష్టం చేశారు. ఒకసారి నిర్ణయం తీసుకొన్న తర్వాత దాని గురించి ఆలోచించవద్దు అని బాబు సూచించాడు.

కౌశల్‌తో బాధ చెప్పుకొన్న నందిని
బిగ్‌బాస్ ఇంటి ఆవరణలో తీరిగ్గా కూర్చొని నందిని, కౌశల్ తమ అఫైర్ల గురించి మాట్లాడుకొన్నారు. దీప్తి అఫైర్ల గురించి కౌశల్ అడుగగా ఏ అఫైర్ గురించి అని అడిగింది. అంతేకాకుండా తన అఫైర్ల గురించి మాట్లాడుతూ ఒకసారి బ్రేకప్ అయిన వాటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని నందిత చెప్పింది.

నా ఫస్ట్ బ్రేకప్ అలా
ప్రస్తుతం సింగిల్‌గా ఉండటం హాయిగా ఉంది. నా మొదటి అఫైర్ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సాగింది. కాకపోతే నాపై ఆంక్షలు విధించడం నాకు నచ్చలేదు. నీకు సినిమా కావాలా? పెళ్లి కావాలా అని అడిగితే సినిమానే కావాలి అని చెప్పాను. దాంతో బ్రేకప్ అయింది. నాకు ఎవరైనా టూ మచ్ పొసెసివ్‌గా ఉండటం నచ్చదు అని నందిత చెప్పింది. అఫైర్ బ్రేకప్ తర్వాత నా బాయ్‌ఫ్రెండ్ పెళ్లి చేసుకొన్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని నందిత చెప్పింది.

సినిమా షూటింగ్ సందడి
మధ్యాహ్నం సమయంలో బ్లాక్ బస్టర్ సినిమా షూటింగ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. అమిత్ డైరెక్టర్‌గా, నందిత అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రోల్‌రైడా సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు కలిసి హీరో, హీరోయిన్ల ఎంపిక చేశారు. కొంచెం నీరు.. కొంచెం నిప్పు సినిమా టైటిల్. ఇంటి సభ్యులకు అమిత్, దీప్తి, రోల్ ఆడిషన్ నిర్వహించారు.

1000 బడ్జెట్‌తో సినిమా
బాహుబలి తర్వాత 1000 కోట్ల బడ్జెట్‌తో కొంచెం నీరు.. కొంచెం నిప్పు రూపొందిస్తున్నాం. రిచ్ హీరోయిన్లు, ముగ్గురు పేద హీరోలు అనే కథాంశంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు.

బాహుబలిలో నటించాను
ఆడిషన్‌కు వచ్చిన తనీష్‌ను సినిమా అనుభవం ఉందా అని అడిగారు. అందుకు సమాధానంగా బాహుబలి చిత్రంలో నటించాను. యుద్ధ సన్నివేశాల్లో 24వ లైన్‌లో 25వ వ్యక్తిగా సైనికుడి పాత్రలో నటించాను అని చెప్పాడు. ఓ లవ్ సీన్ చేసి చూపించాడు.

హీరోలు, హీరోయిన్లుగా..
బ్లాక్‌బస్టర్ సినిమా కోసం తనీష్, సామ్రాట్, కౌశల్ హీరోలుగా ఎంపికయ్యారు. నందిత, దీప్తి సునైన హీరోయిన్లుగా, ప్రొడక్షన్ బాయ్ పెసరట్టు రావుగా ఎంపికయ్యారు. సినిమా షూటింగ్‌లో నందిత, కౌశల్ ఓ జంటగా నటించారు. షూటింగ్ సమయంలోనే నందితకు తనీష్ ప్రేమ లేఖ రాశారు.

పెసరట్టు రావుగా గణేష్
తాను రాసిన ప్రేమలేఖను పెసరట్టు రావు (గణేష్)తో పంపించాడు. ప్రేమలేఖను తీసుకెళ్లి ఇవ్వడానికి కొంత భయపడినా.. ఆ తర్వాత లవ్ లెటర్‌ను తీసుకెళ్లి నందిత చేతిలో పెట్టాడు. అయితే దానిని చూసిన నందిత సీరియస్‌గా రియాక్టయింది. లవ్ లెటర్ తీసుకెళ్లి తనీష్ ఇవ్వు. ఆ తర్వాత దానిని మడిచి పెట్టుకోమని చెప్పు అని పెసరట్టు రావు (గణేష్)కు నందిత చెప్పింది.

గీతా మాధురి అల్లరితో షూటింగ్
కొంచెం నీరు.. కొంచెం నిప్పు సినిమాను నిరాడంబరంగా ప్రారంభించారు. ప్రొడక్షన్ సిబ్బందిగా గీతా మాధురి, రోల్ రైడా చేసే అల్లరి సందడిగా మారింది. సినిమా షూటింగ్ ఆసక్తికరంగా సాగుతుండగానే 38 రోజు ముగిసింది. 39 రోజున ఏం జరుగబోతుందో చూస్తే గానీ తెలియదు.


Click it and Unblock the Notifications











